Antarvedi Beach Accident : సముద్రంలోకి దూసుకెళ్లిన థార్..ఒకరి మృతి

అంతర్వేది బీచ్‌లో న్యూ ఇయర్ వేడుకలు విషాదంగా మారాయి. థార్ కారు సముద్రంలోకి దూసుకెళ్లగా ఓ యువకుడు గల్లంతయ్యాడు.

Antarvedi Beach

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేది బీచ్ సమీపంలో నూతన సంవత్సరం వేడుకలు విషాదంగా మారాయి. కాకినాడకు చెందిన ఇద్దరు యువకులు న్యూ ఇయర్ సెలబ్రేషన్ల సందర్భంగా థార్ కారులో బీచ్ ప్రాంతంలో డ్రైవింగ్ తో షికారు చేస్తున్న కారు అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. అన్నాచెల్లెళ్ల గట్టు సమీపంలో ఉన్న ప్రమాదకరమైన మలుపును సరిగా గమనించకపోవడంతో వాహనం అదుపుతప్పి నేరుగా సముద్రంలోకి వెళ్లిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న కిషన్ (31) సమయస్ఫూర్తితో బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే కారులోని శ్రీధర్ (35) సముద్ర జలాల్లో గల్లంతయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని స్థలానికి చేరుకుకి సహాయ చర్యలు చేపట్టారు. సముద్రపు అలలు ఉద్ధృతంగా ఉండటంతో సహాయక చర్యలు కష్టంగా మారింది. బీచ్ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వాహనాల డ్రైవింగ్ ప్రమాదాలకు దారి తీస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Telangana Assembly : రేపు అసెంబ్లీలో వాటర్ వార్ .. పీపీటీతో కాంగ్రెస్ రె‘ఢీ’ !
Tirumala Laddu Sales : తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాల్లో సరికొత్త రికార్డు

Latest News