Greater Flamingos : అరుదైన అతిథులు.. ఫ్లెమింగో పక్షులు వచ్చేశాయ్

కాకినాడ కోరింగ వన్యప్రాణి అభయారణ్యంలో అరుదైన గ్రేటర్ ఫ్లామింగో పక్షులు దర్శనమిచ్చాయి. హోప్ ఐలాండ్ వద్ద 70 పక్షుల గుంపు ఆకట్టుకుంది.

Greater Flamingos

అమరావతి : ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని కోరింగలో అరుదైన అతిధులు గ్రేటర్ ఫ్లెమింగో పక్షులు వచ్చేశాయి. కోరింగ వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో హోప్ ఐలాండ్ లో ఒకే చోట 70 గ్రేటర్ ఫ్లెమింగో కొంగల గుంపు సందడి కనువిందు చేసింది. గత ఏడాది కేవలం ఒక్క పక్షి మాత్రమే కనిపించిందని..ఈసారి ఇంత పెద్ద సంఖ్యలో రావడం విశేషమని అటవీ శాఖాధికారి రామచంద్రరావు తెలిపారు.. విదేశీ వలస పక్షుల ఆతిథ్యానికి అటవీ శాఖ చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.. సందర్శకులు ఈ పక్షులకు ఎటువంటి అంతరాయం కలిగించవద్దని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది.

తూర్పు ఆఫ్రికా నుండి వలస వచ్చిన ఫ్లెమింగోలు తుఫానులు, కాలుష్యం వంటి సమస్యాత్మక ప్రాంతాల నుంచి గోదావరి డెల్టా మడ అడవులు, కోరింగ వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాలకు ఏటా వలసలు వస్తున్నాయి. తెలుపు, లేత గులాబీ రంగు రెక్కలతో ఆకర్షణీయంగా నీటిలో కదలాడుతూ ఆహార వేటలో మునిగి తేలుతున్న గ్రేటర్ ఫ్లెమింగోల మంద సమూహంతో గోదావరి తీర ప్రాంతాలు గులాబీ మయంగా కనువిందు చేస్తుండటం విశేషం.

శ్రీహరికోట సమీపంలోని పులికాట్ సరస్సు వద్ద ప్రతియేటా వలస పక్షుల కోసం మూడు రోజుల పాటు ఫ్లెమింగో బర్డ్ ఫెస్టివల్స్ నిర్వహించడం ఆనవాయితి. వేలాది సంఖ్యలో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఫ్లెమింగో పక్షులు ఇక్కడకు వలస వచ్చి సంతానోత్పత్తి చేపట్టి తిరిగి వెళ్తున్నాయి. చిన్న ఫ్లెమింగోలు మన దేశంలో ఎక్కువగా గుజరాత్ లోని ఆఫ్ కచ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన పులికాట్ సరస్సు ప్రాంతాల్లో ఏటా వలసలతో సందడి చేస్తుండటం విశేషం.

ఇవి కూడా చదవండి :

Demon Pavan Rithu Chowdary | బిగ్‌బాస్ నుంచి బీబీ జోడీ వరకు.. రీతూ చౌదరి – డిమోన్ పవన్ ప్రేమ కథకు పెళ్లి మలుపు?
US Iran War | ఇరాన్ వైపు మరిన్ని యుద్ద నౌకలు : ట్రంప్

Latest News