న్యూఢిల్లీ: ఇరాన్ తో యుద్దం దిశగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇరాన్ చుట్టుతన అతిపెద్ద విమాన వాహక పౌక అబ్రహం లింకన్ సహా పలు యుద్ద నౌకలను మోహరించిన సంగతి తెలిసిందే. తాజాగా మరిన్ని యుద్ధనౌకలు ఇరాన్ వైపు కదులుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వాటిని వినియోగించే అవసరం రాకూడదని తాను ఆశిస్తున్నట్లు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ చేసిన తాజా ప్రకటన పశ్చిమాసియాలో యుద్ద వాతావారణాన్ని పెంచేదిగా కనిపిస్తుంది. అదనపు వైమానిక దళాలను కూడా ఇరాన్ వైపు తరలిస్తున్నట్లుగా అమెరికా పేర్కొంది. తాజా బలగాల మోహరింపు ప్రక్రియ అమెరికాకు వైమానిక దాడులు, ఖచ్చితమైన క్షిపణి దాడులు చేసేందుకు బలాన్ని అందిస్తుంది.
ప్రస్తుతం మరో అందమైన యుద్ధనౌక ఇరాన్ వైపు ప్రయాణిస్తోందని… ఇరాన్ ఒక ఒప్పందం చేసుకుంటుందని ఆశిస్తున్నామని, ఇప్పటికే వారు ఒప్పందాన్ని చేసుకుని ఉండాల్సిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఒప్పందం దిశగా నాకు చాలాసార్లు ఫోన్ చేశారు’ అని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ లో అంతర్గత అల్లర్ల కారణంగా వేలాది మంది చనిపోవడం పట్ల మండిపడిన ట్రంప్..పరిస్థితులు శాంతించకపోతే ఆ దేశంపై యుద్దానికి సిద్దమవుతామన్నారు. దీంతో ఇరాన్‌పై యూఎస్ ఏక్షణాన దాడి చేస్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికా దాడుల ముప్పు నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కొన్ని రోజులుగా రహస్య బంకర్ కే పరిమితమయ్యారు. అమెరికా సైనిక బలగాల మోహరింపుపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తుంది. సైనికపరంగా దాడి చేస్తే నిర్ణయాత్మకంగా, కఠినంగా స్పందిస్తామని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి :
Silver price hits 4 lakh| వెండి రూ.4లక్షలు..బంగారం కూడా ఆల్ టైమ్ రికార్డు
Road Accident| ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
