Road Accident| ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు.

విధాత, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు.
బోడుప్పల్ నుంచి పోచారం వైపు అతివేగంగా వెళ్తున్న కారు ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ పిల్లర్‌ నంబర్‌ 97ను ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో కారులో 8 మంది ఉండగా.. సాయి చరణ్(23), నిఖిల్(22) అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెంకట్, రాకేష్, యశ్వంత్ అనే మరో ముగ్గురు విద్యార్థులకి గాయాలు అయ్యాయి.

సాత్విక్, హర్షవర్దన్, అభినవ్ అనే మరో ముగ్గురు స్టూడెంట్స్ సురక్షితంగా ఉన్నారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News