Demon Pavan Rithu Chowdary | బిగ్‌బాస్ నుంచి బీబీ జోడీ వరకు.. రీతూ చౌదరి – డిమోన్ పవన్ ప్రేమ కథకు పెళ్లి మలుపు?

Demon Pavan Rithu Chowdary | బిగ్‌బాస్ సీజన్ మొదలవుతుందంటే ప్రేక్షకులు ఎదురుచూసేది కేవలం టాస్క్‌లు, గొడవలు, ఎలిమినేషన్లే కాదు… ఈసారి హౌస్‌లో లవ్ బర్డ్స్ ఎవరు అని. అయితే ప్రతి సీజన్‌లోనూ ఒకటి రెండు జంటలు తమ రొమాన్స్‌తో హైలైట్ అవుతుంటాయి.

Demon Pavan Rithu Chowdary | బిగ్‌బాస్ సీజన్ మొదలవుతుందంటే ప్రేక్షకులు ఎదురుచూసేది కేవలం టాస్క్‌లు, గొడవలు, ఎలిమినేషన్లే కాదు… ఈసారి హౌస్‌లో లవ్ బర్డ్స్ ఎవరు అని. అయితే ప్రతి సీజన్‌లోనూ ఒకటి రెండు జంటలు తమ రొమాన్స్‌తో హైలైట్ అవుతుంటాయి. కొందరి ప్రేమ ట్రాక్‌లు షో ముగిసిన తర్వాత మాయమవుతుంటే, మరికొందరి బంధాలు మాత్రం నిజ జీవితంలోనూ కొనసాగుతూ పెళ్లి వరకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ కోవలోనే ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు 9 జంట డిమోన్ పవన్ – రీతూ చౌదరి పేర్లు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

హౌస్‌లోనే మొదలైన క్లోజ్ బాండ్

బిగ్‌బాస్ తెలుగు 9లో డిమోన్ పవన్, రీతూ చౌదరి మధ్య ఏర్పడిన అనుబంధం అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సెలబ్రిటీ అయిన రీతూ, హౌస్‌లో తన స్నేహితులు ఉన్నప్పటికీ పవన్‌తోనే ఎక్కువగా కనిపించడం చర్చనీయాంశమైంది. టాస్క్‌లు అయినా, నామినేషన్లు అయినా ప్రతి సందర్భంలో రీతూ పవన్‌కు అండగా నిలిచింది. అటు పవన్ కూడా ఇతరులతో కంటే రీతూతోనే ఎక్కువ సమయం గడపడం వల్ల ఇద్దరి మధ్య ఏదో ఉందన్న టాక్ బలంగా వినిపించింది.

ఎలిమినేషన్ తర్వాత కూడా సపోర్ట్

రీతూ హౌస్ నుంచి బయటికి వెళ్లిన తర్వాత కూడా పవన్ గెలుపు కోసం సపోర్ట్ చేసింది. తన సర్కిల్, సోషల్ మీడియా ద్వారా అతడికి ఓట్లు వేయాలని ప్రచారం చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ గాసిప్స్‌పై స్పందించిన రీతూ—తమ మధ్య ప్రేమేమీ లేదని, పవన్ తనకు బెస్ట్ ఫ్రెండ్‌లా సపోర్ట్ చేశాడని స్పష్టం చేసింది. అయినప్పటికీ, “రీతూ వల్లే పవన్ గేమ్‌పై ఫోకస్ తగ్గింది” అంటూ సోషల్ మీడియాలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

రన్నరప్ నుంచి రియాలిటీ షోల వరకు

డిమోన్ పవన్ బిగ్‌బాస్ తెలుగు 9లో సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. చివరి నిమిషంలో 15 లక్షల రూపాయల బ్రీఫ్‌కేస్ తీసుకుని షో నుంచి బయటికి రావడం అప్పట్లో పెద్ద సర్ప్రైజ్‌గా మారింది. బిగ్‌బాస్ తర్వాత పవన్ కెరీర్ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొనగా, తన స్నేహితురాలు రీతూ చౌదరితో కలిసి స్టార్ మా లో ప్రసారమవుతున్న ‘బీబీ జోడీ 2’ డ్యాన్స్ షోలో ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, మా టీవీలోని ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ తన కెరీర్‌ను స్థిరపర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

పెళ్లి గాసిప్స్‌కు కొత్త బలం

ఇటీవల కాలంగా డిమోన్ పవన్ – రీతూ చౌదరి పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఈ గాసిప్స్‌కు తాజాగా స్టార్ మా విడుదల చేసిన ‘స్టార్ మా పరివారం’ ప్రోమో మరింత ఊపునిచ్చింది. ఆ ప్రోమోలో యాంకర్ శ్రీముఖి, రీతూ చౌదరిని ఉద్దేశించి “డిమోన్‌తో పెళ్లెప్పుడు?” అని నేరుగా అడగడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. మ‌రోవైపు ఈ ఇద్దరూ జంటగా కనిపిస్తూ క్యూట్ ఫొటోలు షేర్ చేయడంతో ఏంటి సంగతి ఇద్దరి మధ్య ఏం నడుస్తుందని ఫ్యాన్స్, నెటిజన్లు ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. మ‌రి వీరి రిలేష‌న్ గురించి ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందో చూడాలి.

Latest News