Man Behaving Like A Dog | మహారాష్ట్ర లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు కుక్కలా ప్రవర్తిస్తూ అందరినీ భయబ్రాంతులకు గురి చేశాడు. సతారా-రహిమత్‌పూర్ రోడ్డు లోని అంగాపూర్ ఫాఠా వద్ద రోడ్డుపై అతని ప్రవర్తని అందరినీ విస్మయానికి గురి చేసింది.
యువకుడు రోడ్డుపై చేతులు, మోకాళ్లపై కుక్కలా పాకుతూ కనిపించాడు. అటుగా వెళ్తున్న వారిపై భౌ భౌ అంటూ మొరుగుతూ.. కొరికేందుకు ప్రయత్నించాడు. అలాగే వాహనాలను అడ్డుకుని దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అతడిని 23 ఏళ్ల గోపాల్ భిల్‌గా గుర్తించారు. అతని ప్రవర్తన చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గతంలో కుక్క కాట్ల వల్ల రేబిన్ (Rabies) సోకి ఉండొచ్చని.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నట్లు భావించారు. అతి కష్టం మీద అతడిని పట్టుకుని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ యువకుడిని పరీక్షించిన వైద్యులు అతడికి రేబిస్ సోకలేదని గుర్తించారు. వాస్తవానికి అతను తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ యువరాజ్ కర్పే స్పష్టం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆ యువకుడిని మెరుగైన చికిత్స కోసం సతారా జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఐసోలేషన్ వార్డులో ఉంచి అతడి ప్రవర్తనను వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఆ యువకుడి వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. రేబిస్ సోకిందేమో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కుక్క కాటుకుగురైన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలని, రేబిస్ టీకాలు వేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Pratyusha | ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు .. సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలని ఆదేశాలు
Gadham Vivek convoy attack| మంత్రి వివేక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి..క్యాతనపల్లిలో హై టెన్షన్
