Gadham Vivek convoy attack| మంత్రి వివేక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి..క్యాతనపల్లిలో హై టెన్షన్

క్యాతనపల్లి మున్సిపాల్టీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంత్రి గడ్డం వివేక్ కాన్వాయ్ పైన, పోలీసులపైన బీఆర్ఎస్ శ్రేణులు రాళ్లు, చెప్పులతో దాడికి దిగారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Feb 17, 2026, 11:49 am IST
Read Time: 3 mins
Gadham Vivek convoy attack| మంత్రి వివేక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి..క్యాతనపల్లిలో హై టెన్షన్

విధాత : క్యాతనపల్లి మున్సిపాల్టీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం ఎన్నిక ప్రక్రియ సమావేశం పర్యవేక్షణకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీని, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోయారు. మంత్రి గడ్డం వివేక్ కాన్వాయ్ పైన,  ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్ పైన, పోలీసులపై బీఆర్ఎస్ శ్రేణులు రాళ్లు, చెప్పులతో దాడికి దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళన కారులను తరిమికొట్టారు. అయితే 23సభ్యుల కోరం పూర్తి కావడంతో కౌన్సిల్ హాల్ లో ఎన్నికల సమావేశాన్ని అధికారులు పోలీసు బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు.

ఇబ్రహీంపట్నంలోనూ ఉద్రిక్తత

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు బాహాబాహికి దిగారు. పరస్పరం కుర్చీలు విసురుకుని ఘర్షణకు దిగారు. పోలీసులు ఇరువర్గాలను అదుపుచేయగా.. భారీ బందోబస్తు మధ్య కౌన్సిల్ సమావేశం కొనసాగుతుంది.   రహస్య ఓటింగ్ కు కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో వివాదం నెలకొంది.  చివరకు ఓటింగ్ అనంతరం ఇబ్రహీం పట్నం మున్సిపల్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ ఎమ్మెల్యే రంగారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కాంగ్రెస్ కు చుక్కుదురైంది. తొర్రూర్, జనగామల ఎన్నికల ప్రక్రియలు ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి.