2 Women get Married | యువ‌తిని పెళ్లాడిన మ‌రో యువ‌తి.. ఇక సంతానం కోసం ఆ ప‌నికి సిద్ధ‌మైన‌ జంట‌..!

2 Women get Married | వారిద్ద‌రూ అమ్మాయిలే. ఒక‌రంటే ఒక‌రికి ఎంతో ప్రేమ‌. అనతి కాలంలోనే వారిద్ద‌రి మ‌ధ్య చిగురించిన స్నేహం.. ప్రేమించుకునే దాకా దారి తీసింది. ప్రేమించుకోవ‌డ‌మే కాదు.. ఒక‌రినొక‌రు పెళ్లాడారు. ఈ ఇద్ద‌ర‌మ్మాయిల వివాహం హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం నిర్వ‌హించ‌డం విశేషం. మ‌రి ఈ అమ్మాయిల ప్రేమ వివాహం గురించి తెలుసుకోవాలంటే హ‌ర్యానాలోని గురుగ్రామ్ వెళ్లాల్సిందే.

  • Publish Date - June 26, 2024 / 10:24 PM IST

2 Women get Married | వారిద్ద‌రూ అమ్మాయిలే. ఒక‌రంటే ఒక‌రికి ఎంతో ప్రేమ‌. అనతి కాలంలోనే వారిద్ద‌రి మ‌ధ్య చిగురించిన స్నేహం.. ప్రేమించుకునే దాకా దారి తీసింది. ప్రేమించుకోవ‌డ‌మే కాదు.. ఒక‌రినొక‌రు పెళ్లాడారు. ఈ ఇద్ద‌ర‌మ్మాయిల వివాహం హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం నిర్వ‌హించ‌డం విశేషం. మ‌రి ఈ అమ్మాయిల ప్రేమ వివాహం గురించి తెలుసుకోవాలంటే హ‌ర్యానాలోని గురుగ్రామ్ వెళ్లాల్సిందే.

గురుగ్రామ్‌కు చెందిన అంజు శ‌ర్మ వ‌య‌సు 30 ఏండ్లు. అంజుకి ఆమె వ‌య‌సున్న క‌విత అనే మ‌రో అమ్మాయి ప‌రిచ‌య‌మైంది. క‌విత స్వ‌స్థ‌లం హ‌ర్యానాలోని ఫ‌తేహాబాద్. ఇక క‌విత మేక‌ప్ ఆర్టిస్ట్. అంజునేమో.. అంజు అనే యూట్యూబ్ చానెల్‌లో న‌టిగా పాత్ర‌లు చేస్తుంది. ఓ షూటింగ్‌లో భాగంగా క‌విత‌, అంజు 2020లో క‌లుసుకున్నారు. అక్క‌డ ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ఇద్ద‌రూ క‌లిసి జీవించాల‌నుకున్నారు. అదే ఏడాది క‌విత త‌న త‌ల్లిని కోల్పోయింది. దీంతో ఆమె మ‌రింత మ‌నోవేద‌న‌కు గురైంది. ఆ స‌మ‌యంలో అంజు క‌విత అన్ని విధాలా అండ‌గా నిలిచింది. ఇద్ద‌రి మ‌న‌సులు క‌లియ‌డంతో చివ‌ర‌కు ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. అంజు త‌ల్లి క‌విత‌ను త‌న కోడ‌లిగా అంగీక‌రించింది. క‌విత తండ్రి, సోద‌రుడు కూడా ఆమెకు స‌హ‌క‌రించారు.

హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం..

ఇక ఇరు కుటుంబాలకు చెందిన కుటుంబ స‌భ్యులు, స్నేహితుల ఆధ్వ‌ర్యంలో అంజు, క‌విత ఏప్రిల్ 23, 2024న పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి వివాహం హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగింది. పంచ‌భూతాల సాక్షిగా, ఏడడుగులు వేసి ఏక‌మ‌య్యారు అంజు, క‌విత‌. ఈ జంట‌కు అతిథులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు. గురుగ్రామ్‌లోని చోటీ పంచాయత్ ధ‌ర్మ‌శాల‌లో వివాహ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.

అంజునేమో భ‌ర్త‌.. క‌విత‌నేమో భార్య‌..

ఈ వివాహంతో తాము ఎంతో సంతోషంగా ఉన్నామ‌ని అంజు, క‌విత చెప్పుకొచ్చారు. ఇప్పుడు అంజు భ‌ర్త‌గా, క‌విత భార్య‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న పేరును అంజు శ‌ర్మ‌గా మార్చుకున్నాన‌ని అంజు తెలిపారు. త‌న భార్య త‌న‌ను ముద్దుగా అజ్జు అని పిలుస్తుంద‌న్నారు. ఒక అబ్బాయికి, అమ్మాయికి ఎలా వివాహం జ‌రుగుతుందో ఆ మాదిరిగానే త‌మ పెళ్లి జ‌రిగింద‌ని చెప్పారు. ఇరు కుటుంబాలు త‌మ పెళ్లిని స్వీక‌రించిన‌ట్లు తెలిపారు.

ఓ బిడ్డ‌ను ద‌త్త‌త తీసుకుంటాం..

పెళ్లైన ప్ర‌తి జంట కూడా త‌మ వంశాన్ని పెంచుకోవాల‌ని క‌ల‌లు కంటారు. కానీ మాకు పిల్ల‌లు పుట్టే అవ‌కాశం లేదు. ఎందుకంటే ఇద్ద‌రం అమ్మాయిల‌మే కాబ‌ట్టి. పిల్ల‌ల‌ను క‌నేందుకు అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ తాము అటు వైపు వెళ్లాల‌నుకోవ‌డం లేదు. అనాథ ఆశ్ర‌మం నుంచి ఒక బిడ్డ‌ను ద‌త్త‌త తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మేం స‌మాజం గురించి ఆలోచించ‌డం లేద‌ని, ఎవ‌రు ఏమ‌నుకున్నా త‌మ‌కు ఇబ్బంది లేద‌ని అంజు పేర్కొన్నారు. సోష‌ల్ మీడియాలో మాపై విప‌రీత‌మైన ట్రోలింగ్ జ‌రుగుతుంద‌న్నారు. అయినా మేం ప‌ట్టించుకోమ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం అంజు, క‌విత వివాహం గురించి మాట్లాడుకోవ‌డంతో.. వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Latest News