ఆయన ఒంటెపైన..ఈయన వీల్ చైర్ పైన

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజున భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 17లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 1071కిపైగా నామినేషన్లు దాఖలవ్వడం ఆసక్తికరం

  • Publish Date - April 25, 2024 / 06:21 PM IST

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో వారు స్పెషల్‌

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజున భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 17లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 1071కిపైగా నామినేషన్లు దాఖలవ్వడం ఆసక్తికరం. నామినేషన్ల దాఖలు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలతో రిటర్నింగ్ అధికారి కార్యాలయాలకు తరలిరాగా, చిన్న పార్టీలు.. ఇండిపెండెంట్ అభ్యర్థులు తమను బలపరిచే వారితో కలిసి నామినేషన్లను నిరాడంబరంగా దాఖలు చేశారు. హైదరాబాద్ ఎంపీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి అనిల్ సేన్ ఒంటెపై వచ్చి నామినేషన్ దాఖలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అటు వరంగల్ ఎంపీ స్థానంలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా సినీ నటుడు..మాజీ మంత్రి బాబుమోహన్ వీల్ చైర్‌లో వచ్చి తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

Latest News