Bharat Taxi | త్వరలో భారత్‌ ట్యాక్సీ రయ్‌రయ్‌.. ఈ సేవల గురించి తెలుసా..?

క్యాబ్ బుకింగ్ ఇప్పుడు మరింత సులభతరం కాబోతోంది. ఉబర్ (Uber), ఓలా (Ola), ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు దీటుగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార (కో-ఆపరేటివ్‌) క్యాబ్‌ సేవలు ప్రారంభం కాబోతున్నాయి.

Bharat Taxi

Bharat Taxi | క్యాబ్ బుకింగ్ ఇప్పుడు మరింత సులభతరం కాబోతోంది. ఉబర్ (Uber), ఓలా (Ola), ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు దీటుగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార (కో-ఆపరేటివ్‌) క్యాబ్‌ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ‘భారత్‌ ట్యాక్సీ’ పేరుతో (Bharat Taxi) వస్తున్న ఈ సేవలు ఢిల్లీ సహా ఇతర నగరాల్లో ఈ నెల చివరినాటికి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ భారత్‌ ట్యాక్సీ సేవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

యాప్‌ ఆధారిత ట్యాక్సీ సర్వీసులపై కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలు, క్యాన్సిలేషన్లతో పాటు తమ ఆదాయం నుంచి కంపెనీలు 25 శాతం వరకు కమీషన్ తీసుకోవడంపై డ్రైవర్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ సమాధానం ఇచ్చేలా కేంద్రం భారత్‌ ట్యాక్సీని తీసుకొస్తోంది. ఇందులో నమోదు చేసుకున్న ట్యాక్సీ డ్రైవర్లు ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మెంబర్‌షిప్‌ కింద స్వల్ప మొత్తం ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

ALSO READ : జనవరి 1 నుంచి ఢిల్లీలో భారత్ ట్యాక్సీ : ఇది ఎలా పనిచేస్తుంది?

దేశ రాజధాని ఢిల్లీలో భారత్‌ ట్యాక్సీ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇందులో ఆటో, క్యాబ్‌, బైక్‌ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ భారత్‌ ట్యాక్సీ యాప్‌ ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. యూజర్లు తమ మొబైల్‌ నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇదివరకు ఉన్న క్యాబ్‌ ఛార్జీల (Cab Charges) నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా.. ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే ఈ సేవలను పొందే అవకాశముంది. సుమారు 1.4 లక్షల మంది డ్రైవర్లు భారత్‌ ట్యాక్సీ యాప్‌లో రిజిస్ట్రర్‌ చేసుకున్నట్లు కేంద్రం ఇటీవలే తెలిపింది. ఈ సేవల్లో రైడ్‌ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని (100%) డ్రైవర్లకే చెల్లిస్తారు. అతి తక్కువ నామినల్‌ రుసుముతో డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫాంలో పనిచేయవచ్చు.

భారత్ టాక్సీ.. ఓలా, ఉబర్ కంటే భిన్నంగా పనిచేస్తుంది. భారత్‌ ట్యాక్సీ సేవలు సరసమైన ధరల్లోనే అందుబాటులో ఉంటాయి. అదనపు ఛార్జీలు ఉండవు. సుదూర ప్రయాణాలకు కూడా ఓలా, ఉబర్‌ కంటే ఇది చాలా చౌక ధరకే అందుబాటులో ఉంటుంది. ఓలా, ఉబర్‌ సేవలు కేవలం నగరాలకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ భారత్‌ ట్యాక్సీ అలా కాదు. వన్‌ వే అవుట్‌ స్టేషన్‌ ట్రిప్పులు, రౌండ్‌ ట్రిప్పులు, మల్టీ డే ట్రావెల్‌ అనుభూతిని అందిస్తుంది. ఇందులో ప్రొఫెషనల్‌, వెరిఫైడ్‌ డ్రైవర్లు పనిచేస్తారు. సుదూర డ్రైవింగ్‌ అనుభవం ఉన్న డ్రైవర్లను మాత్రమే తీసుకుంటారు. ఇందులో 24×7 కస్టమర్‌ సపోర్ట్‌ కూడా ఉంటుంది. ఇది ప్రయాణికులకు సురక్షితం కూడా. కాల్‌, వాట్సాప్‌ ద్వారా ట్రిప్‌ సమయంలో తక్షణ సాయం అందుతుంది.

ఇవి కూడా చదవండి :


Telangana Temple Circuit : తెలంగాణలో టెంపుల్ సర్క్యూట్…బాసర నుంచి భద్రాచలం వరకు
Beggar | షాకింగ్‌.. బిచ్చగాడి వద్ద రూ.4 లక్షల నగదు.. రద్దు చేసిన, విదేశీ కరెన్సీ లభ్యం

Latest News