రేపు ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ

  • Publish Date - October 17, 2023 / 12:31 PM IST
  • ఫైనల్ కానున్న తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా


విధాత: బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బుధవారం న్యూఢిల్లీలో భేటీ కానుంది. ఈ భేటీకి హాజరుకావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఢిల్లీ పిలిపించింది. నేటీ భేటీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ అభ్యర్ధులకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశముందని కమల నాధులు చెబుతున్నారు.


ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, సంస్థాగత కార్యదర్శి బిఎల్‌.సంతోష్‌ సహా కేంద్ర కమిటీలోని సభ్యులు ఈ భేటీలో హాజరవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల బాధ్యుడు ప్రకాశ్ జవదేకర్ పార్టీ అధ్యక్షుడు నడ్డాతో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. కనీసంగా 60మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది.


మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, చత్తీస్‌ఘడ్‌లలో మాదిరే కేంద్ర మంత్రులు, సిటింగ్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించాలని కేంద్ర నాయకత్వం ఆలోచనగా ఉంది. అధికార సాధన క్రమంలో ముఖ్య నాయకులందరిని బరిలోకి దిగాలని పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పటికే సూచనలిచ్చింది.