విధాత: రహదారులు..ఫ్లై ఓవర్లు..మెట్రో నిర్మాణాలకు ప్రజల నుంచి బలవంతపు భూసేకరణ చేసే ప్రభుత్వాలను చూశాం. తాజాగా ఓ ఫ్లై ఓవర్(Flyover) నిర్మాణానికి అడ్డుగా ఉన్న భవనాన్ని కూల్చకుండా అలాగే నిర్మాణం చేసుకుంటు వెళ్లిపోయిన వింత ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు చూస్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో(Nagpur) ఈ అద్భుతం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వివరాల్లోకి వెళితే నాగ్‌పూర్-డిఘోరి ఫ్లైవోవర్(Nagpur’s Indora-Dighori flyover) నిర్మాణ మార్గంలో మూడు అంతస్తుల భవనం ఉండగా.. దానిని ఇంజినీర్లు కూల్చకుండా భవనం ఆనుకుని ఫ్లైఓవర్ నిర్మాణం చేసుకుంటు పోయారు. కింద నుంచి చూస్తే ఫ్లైఓవర్ భవనంలోకి కొంత లోపలి నుంచి నిర్మించినట్లుగా కనబడుతూ ఇదో వింతైన..అద్బుత నిర్మాణంగా నెటిజన్ల ట్రోలింగ్ కు గురవుతుంది. బిల్డింగ్‌లో నుంచే ఫ్లైఓవర్ నిర్మాణం అనేది..మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఇంజినీరింగ్ మార్వెల్ గా సెటైర్లు వేస్తున్నారు.