Site icon vidhaatha

Nagpur | భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టి.. హృదయ విదారక వీడియో

Nagpur | విధాత : రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన భార్య మృతదేహాన్ని తరలించేందుకు ఎవరు ముందుకురాని పరిస్థితుల్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని తన బైక్ పై తీసుకెళ్లిన హృదయ విదారక పరిస్థితి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపై అమిత్, అతని భార్య ఆదివారం లోనారా ప్రాంతం నుంచి కరణ్ పూర్ కు వెలుతుండగా..వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అమిత్ భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు సహాయం కోసం అమిత్ ఎంతగా వేడుకున్నా ఎవరూ స్పందించలేదు. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

చివరకు ఆమె మృతదేహాన్ని తరలించేందుకు సహకరించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో భార్య మృతదేహాన్ని అతను బైక్ పై కట్టుకుని తన గ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో వాహనదారులు తాము సహకరిస్తామంటూ చెప్పినా వినిపించుకోకుండా ముందుకెళ్లాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా..వారు అమిత్ ను అడ్డుకుని ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు.

Exit mobile version