Mumbai Mono Rail Accident| ముంబైలో రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన మోనో రైలు

నిన్న చత్తీస్ గఢ్, నేడు యూపీ చునార్ రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదాలను మరువకముందే ఇదే రోజు బుధవారం ముంబైలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన రేపింది. ముంబైలోని వడాల-జిటిబి రైల్వే స్టేషన్ లో మోనో రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది.

విధాత : దేశంలో వరుస రైలు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. నిన్న చత్తీస్ గఢ్, నేడు యూపీ చునార్ రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదాలను మరువకముందే ఇదే రోజు బుధవారం ముంబై( Mumbai)లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన రేపింది. ముంబైలోని వడాల-జిటిబి రైల్వే స్టేషన్ లో మోనో రైలు(Mono Train Accident) పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది. రైలు ఫ్లైవోవర్ ట్రాక్ నుంచి కిందపడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

అదృష్టవశాత్తు ఈ ప్రమాదంతో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు. మోనో రైలు టెస్ట్ డ్రైవ్ జరుగుతుండగా ట్రాక్ మారే సమయంలో పట్టాలు తప్పింది. వెంటనే రైల్వే అధికారులు, నిపుణులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దేశంలోని ఇతర నగరాల్లో మెట్రో రైలు మాదిరిగా..ముంబైలో మోనో రైలు నిర్వహణ కొనసాగుతుంది.