విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల నుంచి తిరువనంతపురం ప్రయాణించేందుకు రైల్వే శాఖ మరో అమృత భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మంజూరు చేసింది. చర్లపల్లి-తిరువనంతపురం మధ్య నడిచే అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు శుక్రవారం తిరువనంతపురంలో ప్రారంభించనున్నారు. లాంగ్ జర్నీ ప్రయాణికులకోసం ఈ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ లు అవసరమైన ఆధునిక అన్ని వసతులు ఏర్పాటు ఉన్నాయి.
చర్లపల్లి నుంచి తిరువనంతపురం మధ్య ప్రయాణించే ఈ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో ఆగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలలో ఈ రైలు ఆగనుంది. ఇప్పటికే తెలంగాణకు చర్లపల్లి – ముజఫర్‌పూర్ (బిహార్) మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును కేటాయించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించడం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Gravity Lose Fact Check | ఆ రోజు గురుత్వాకర్షణ శక్తిని కోల్పోనున్న భూమి.. వాస్తవాలేంటి? నాసా ఏం చెబుతున్నది?
KTR : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు!
