Arasavalli : అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు!

సూర్యకిరణాలు సూర్యనారాయణ స్వామిని తాకకపోవడంతో భక్తులు నిరాశ, వచ్చే అక్టోబర్‌లో ఆ ఘట్టాన్ని చూడాలని వేచి చూస్తున్నారు.

suryanarayana swamy temple

అమరావతి : ఏపీలోని ప్రసిద్ద అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ మూల విరాట్ ను ప్రతిఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా సూర్యకిరణాలు తాకుతాయని ఎదురుచూసిన భక్తులకు, దేవస్థాన సిబ్బంది మంగళవారం కూడా నిరాశే ఎదురైంది. ఏటా మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో స్వామివారిని సూర్య కిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తుంది. ఈ అద్బుత ఘట్టాన్ని వీక్షించి తరించేందుకు భక్తులు భారీగా సూర్యదేవాలయానికి తరలివస్తుంటారు.

ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల సందర్బంగా సూర్యకిరణాలు స్వామివారిని తాకడం ఆనవాయితీ. అయితే నిన్న సోమవారం, నేడు మంగళవారం కూడా సూర్యకిరణాలు సూర్యనారాయణ స్వామివారిని తాకలేదు. సూర్యనారాయణుడిని తాకే సూర్యకిరణాల స్పర్శను స్వయంగా తిలకించి పులకించాలని తెల్లవారుజామునే తరలివచ్చిన భక్తజనం నిరాశ చెందారు. మంచు ప్రభావంతో సూర్యకిరణాలు స్వామివారిని తాకలేకపోయాయని దేవస్థానం అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

Om Birla : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..కొనసాగుతున్న చర్చ
BCCI Announce Cash Reward : టీ 20వరల్డ్ కప్ విజేత టీమిండియాకు బీసీసీఐ భారీ నజరాన!

Latest News