విధాత : టీ 20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న టీమ్ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించింది. టీమిండియాకు బీసీసీఐ మంగళవారం ఏకంగా రూ 131 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ ప్రకటన చేశారు. దేశం ప్రతిష్టను పెంచేలా…అద్భుత ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమ్‌ఇండియాకు బీసీసీఐ రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది అని సైకియా తెలిపారు.
గతంలో 2024లో సైతం కెప్టెన్ రోహిత శర్మ సారధ్యంలో టీమిండియా టీ 20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. అప్పుడు కూడా టీమిండియా జట్టుకు బీసీసీఐ రూ.125కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. ఇప్పుడు మరో రూ. 6కోట్ల పెంచి 2026 టీ 20వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జట్టుకు అందించనుంది.
మరోవైపు ఐసీసీ సైతం 2026 టీ 20వ వరల్డ్ కప్ విన్నర్ టీమ్ టీమిండియాకు కప్ తో పాటు రూ.21.5 కోట్లను బహుమతిగా ప్రకటించింది. రన్నరప్ జట్టు న్యూజిలాండ్ కు రూ. 10.75కోట్లు ప్రకటించింది. ఐసీసీ, బీసీసీఐలతో వరల్డ్ కప్ విజేతలైన టీమిండిమా క్రికెటర్లకు స్పాన్సర్స్ సంస్థలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం భారీ నజరానాలు అందిస్తుండటం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
Kavitha Hunger Strike : కొనసాగుతున్న కవిత నిరాహార దీక్ష!
Nagarjuna | రాజమౌళి – మహేష్ భారీ ప్రాజెక్ట్‌కు నాగార్జున నో చెప్పారా .. అసలు కారణం ఇదేనా?
