ముక్కణపు వన్డే సిరీస్..టీమిండియా- ఏ జట్టులోకి వైభవ్ ఎంట్రీ !

శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం ప్రకటించిన ఇండియా-ఏ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా, తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ముక్కణపు వన్డే సిరీస్..టీమిండియా- ఏ జట్టులోకి వైభవ్ ఎంట్రీ !

జూన్ లో శ్రీలంకలో జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం భారత్‌-ఎ జట్టు ఎంపికలో బీసీసీఐ సెలక్టర్లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో భారత్, శ్రీలంక, అఫ్గానిస్థాన్ ఎ జట్లు తలపడనున్నాయి. ఈ ట్రై సిరీస్ కోసం ఇండియా ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత్ ఏ జట్టు కెప్టెన్ గా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మను నియమించగా..యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో పాటు ప్రియాంశ్ ఆర్యను ఎంపిక జట్టుకు ఎంపిక చేశారు.

భారత్ ఏ జట్టు: తిలక్‌ వర్మ(కెప్టెన్‌), ప్రియాంశ్‌ ఆర్య, వైభవ్‌ సూర్యవంశీ, రియాన్‌ పరాగ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఆయుష్ బదోని, నిశాంత్‌, హర్ష్‌ దూబె, సూర్యాంశ్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), కుమార్‌ కుశాగ్ర(వికెట్‌ కీపర్‌), విప్రాజ్‌ నిగమ్‌, యశ్‌ ఠాకూర్‌, యుద్‌వీర్‌ సింగ్, అన్షుల్‌ కంబోజ్‌, అర్షద్‌ ఖాన్‌.

ఈ పరిమిత ఓవర్ల ముక్కోణపు సిరీస్ ముగిసిన తర్వాత, ఇండియా ఏ జట్టు శ్రీలంక ఏ జట్టుతో రెండు బహుళ-రోజుల (multi-day) మ్యాచ్‌లను కూడా ఆడనుంది. ఈ ‘రెడ్-బాల్’ మ్యాచ్‌ల కోసం జట్టును తర్వాతి తేదీలో ప్రకటిస్తారు.’వైట్-బాల్’ సిరీస్ దంబుల్లాలో జరగనుండగా, బహుళ-రోజుల మ్యాచ్‌లు గాలేలో జరుగుతాయి.

ఇవి కూడా చదవండి :

మోదీ హామీ వట్టి మాటే.. మెట్రో విస్తరణకు ఇవ్వని గ్రీన్ సిగ్నల్!
కోవిడ్‌ వల్ల 2.20 కోట్ల మంది మృతి: డబ్ల్యుహెచ్ వో కీలక ప్రకటన