మోదీ హామీ వట్టి మాటే.. మెట్రో విస్తరణకు ఇవ్వని గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్ మెట్రో విస్తరణకు అవసరమైన అన్ని షరతులు పూర్తి చేసినప్పటికీ కేంద్ర కేబినెట్ మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో తెలంగాణలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | May 14, 2026, 5:43 pm IST
Read Time: 4 mins
మోదీ హామీ వట్టి మాటే.. మెట్రో విస్తరణకు ఇవ్వని గ్రీన్ సిగ్నల్!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం హైదరాబాద్ మెట్రో విస్తరణ (దశ 2 & 3)కు సంబంధించిన ఆమోదాలను మరోసారి విస్మరించడం తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచింది. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ సాధనకు రాష్ట్రాల అభివృద్దితోనే సాధ్యం అని..తెలంగాణ అభివృద్దికి సహకరిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ అభివృద్దికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆచరణలో అందుకు భిన్నంగా మోదీ ప్రభుత్వం వ్యవహరించడం తెలంగాణ వాసులను అసంతృప్తికి గురి చేస్తుంది.

బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో PPP విధానం కింద నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయ ఆధునీకరణకు, గుజరాత్ లో రూ.3,900 కోట్లకు పైగా పెట్టుబడితో రెండు కొత్త సెమీకండక్టర్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అదే సమయంలో హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణన ప్రతిపాదనలను మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించింది.

అన్ని షరతులను పూర్తి చేసినా..దక్కని ఆమోదం

హైదరాబాద్ మెట్రో విస్తరణ ఆమోదం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం విధించిన కీలక షరతులన్నింటిని ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ర రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చింది. ఏప్రిల్ 30న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ (Phase-1) ను L&T సంస్థ నుండి అధికారికంగా స్వాధీనం చేసుకుంది.

గత వారం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి, L&T మెట్రో స్వాధీనానికి సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించారు.అలాగే 2వ మరియు 3వ దశల విస్తరణ ఆమోదాల కోసం గట్టిగా పట్టుబడుతూ అవసరమైన ప్రతిపదనలు సమర్పించారు. అన్ని నిబంధనలను నెరవేర్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, హైదరాబాద్ అభివృద్దికి సంబంధించిన కీలక ప్రాజెక్టులను మరోసారి విస్మరించడం వివక్షతకు నిదర్శనంగా కనిపిస్తుందన్న విమర్శలు వినవస్తున్నాయి. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ పట్ల ఈ నిరంతర వివక్ష ఎందుకు? అన్న ప్రశ్న రేకెత్తుతుంది.

ఇవి కూడా చదవండి :

కోవిడ్‌ వల్ల 2.20 కోట్ల మంది మృతి: డబ్ల్యుహెచ్ వో కీలక ప్రకటన
మూడో దశ సర్ కు ఈసీ ప్రకటన..ఏపీ, తెలంగాణలో అప్పుడే!