మూడో దశ సర్ కు ఈసీ ప్రకటన..ఏపీ, తెలంగాణలో అప్పుడే!

ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫేజ్‌-3 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)కు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఏపీలో జూన్ 15 నుంచి సెప్టెంబర్ 22 వరకు, తెలంగాణలో జూన్ 25 నుంచి అక్టోబర్ 1 వరకు సర్ ప్రక్రియ కొనసాగనుంది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | May 14, 2026, 4:38 pm IST
Read Time: 3 mins
మూడో దశ సర్ కు ఈసీ ప్రకటన..ఏపీ, తెలంగాణలో అప్పుడే!

ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫేజ్‌-3 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)కు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఏపీలో జూన్ 15 నుంచి సెప్టెంబర్ 22 వరకు, తెలంగాణలో జూన్ 25 నుంచి అక్టోబర్ 1 వరకు సర్ ప్రక్రియ కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, ఝార్ఖండ్‌, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, ఒడిశా, పంజాబ్‌, సిక్కిం, ఉత్తరాఖండ్‌, త్రిపుర ఉన్నాయి.

మూడో దశలో 3.94 లక్షల మందికిపైగా బూత్ స్థాయి అధికారులు.. 36.73 కోట్ల మంది ఓటర్ల వద్దకు వెళ్లనున్నారు. డిసెంబర్‌ 23న త్రిపురతో మూడో దశ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ముగియనుంది. ఎస్‌ఐఆర్‌కు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ విజ్ఞప్తి చేసింది.

ఏపీలో సర్ పక్రియ వివరాలు

ఏపీలో జూన్‌ 5 నుంచి 14 వరకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కోసం సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. అదే నెల 15 నుంచి జులై 14 వరకు సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించనున్నారు. అనంతరం జులై 21న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. సెప్టెంబర్‌ 22న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు.

తెలంగాణలో సర్ ప్రక్రియ వివరాలు

తెలంగాణలో జూన్‌ 15 నుంచి 24 వరకు సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే చేపడతారు. అనంతరం జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించి.. అదే రోజు నుంచి సెప్టెబర్‌ 28 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 1న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి :

ఏపీ కేబినెట్ పొదుపు మంత్రం
మూడో దశ సర్ కు ఈసీ ప్రకటన..ఏపీ, తెలంగాణలో అప్పుడే!