Sree Leela | శ్రీలీల–తిలక్ వర్మ రిలేషన్ వార్తలకు ఫుల్‌స్టాప్.. “అవి కేవలం పుకార్లు మాత్రమే” అంటూ తల్లి క్లారిటీ

Sree Leela | టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీలీల ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల ఆమె పేరు భారత యువ క్రికెటర్ తిలక్ వర్మతో కలిపి సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి

  • By: Sandeep |    movies |    Published on : May 18, 2026 10:26 AM IST
Sree Leela | శ్రీలీల–తిలక్ వర్మ రిలేషన్ వార్తలకు ఫుల్‌స్టాప్.. “అవి కేవలం పుకార్లు మాత్రమే” అంటూ తల్లి క్లారిటీ

Sree Leela | టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీలీల ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల ఆమె పేరు భారత యువ క్రికెటర్ తిలక్ వర్మతో కలిపి సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై తాజాగా శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు.

కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన శ్రీలీల, ‘పెళ్లిసందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా వాణిజ్యపరంగా పెద్ద విజయం సాధించకపోయినా, తన అందం, నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అనంతరం ఆమె నటించిన ‘ధమాకా’ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.

స్టార్ హీరోల‌తో…

ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను కూడా ఆమె దక్కించుకుంది. బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖ హీరోలతో తెర పంచుకుని స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. కొన్ని సినిమాలు ఆశించిన విజయాలు అందుకోకపోయినా, ఆమెకు అవకాశాల పరంగా మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ శ్రీలీల తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా శ్రీలీల స్టేడియంలో కనిపించడం, అలాగే ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులతో కలిసి ఫోటోలు దిగడం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఆమె, తిలక్ వర్మ మధ్య రిలేషన్ ఉందంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ప్రచారం క్రమంగా మరింత వేగం పుంజుకుని పెళ్లి వార్తల వరకు వెళ్లింది.

స్వ‌ర్ణ‌ల‌త క్లారిటీ..

ఈ నేపథ్యంలో స్పందించిన డాక్టర్ స్వర్ణలత, “ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. శ్రీలీల, తిలక్ వర్మ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యక్తిగతంగా కలుసుకోలేదు” అని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో ఆధారాలు లేకుండా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వస్తున్న కథనాల నేపథ్యంలో, అధికారిక సమాచారం వచ్చే వరకు ఇలాంటి వార్తలను నమ్మకూడదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.