IPL 2026 ఇప్పట్లో లేనట్లేనా..?

2026 ఐసీసీ టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ దక్కించుకుంది. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వరల్డ్ కప్ విజయం ఇచ్చిన కిక్ దిగక ముందే క్రికెట్ అభిమానులను మరో వార్త నిరసానికి గురి చేస్తుందనే చెప్పాలి. ఆ వార్త ఏంటంటే 2026 ఐపీఎల్ ఈ సారి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి ఏటా ఐపీఎల్ మ్యాచ్‌లు మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం అవుతాయి. కానీ ఈ సారి మాత్రం అలా కాకుండా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

  • By: Subbu |    cricket |    Published on : Mar 11, 2026 4:05 PM IST
IPL 2026 ఇప్పట్లో లేనట్లేనా..?

విధాత, హైదరాబాద్: 2026 ఐసీసీ టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ దక్కించుకుంది. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వరల్డ్ కప్ విజయం ఇచ్చిన కిక్ దిగక ముందే క్రికెట్ అభిమానులను మరో వార్త నిరసానికి గురి చేస్తుందనే చెప్పాలి. ఆ వార్త ఏంటంటే 2026 ఐపీఎల్ ఈ సారి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి ఏటా ఐపీఎల్ మ్యాచ్‌లు మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం అవుతాయి. కానీ ఈ సారి మాత్రం అలా కాకుండా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఎంతో ఆదరణ లభించిన పొట్టి ఫార్మట్ ఈ సారి ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఎలక్షన్లు కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలకు సంబంధించిన తేదీలు ఇప్పటివరకు వెల్లడించకపోయినా, త్వరలోనే ఎలక్షన్ కమిషన్ ఆయా రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్చలు జరిపినట్లు కూడా సమాచారం. ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత మ్యాచ్‌లకు సంబంధించిన ఫుల్ షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే మరో వైపు ఐపీఎల్‌ను పూర్తిగా వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. దీని వెనక ఉన్న కీలకమైన కారణం ఏంటంటే.. మిడిల్ ఈస్ట్‌లో నెలకొంటున్న పరిస్థితులు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ కొరత నెలకొన్నది. దీంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఒక వేళ ఇదే గనుక నిజమైతే, 2026 ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటన ఆలస్యమవ్వక తప్పదని చెప్పవచ్చు. మొదటి రెండు వారాలకు సంబంధించిన మ్యాచ్‌ల జాబితా మార్చి 7కే విడుదల కావాల్సి ఉండగా, ఐపీఎల్ జీసీ నుంచి కానీ, బీసీసీఐ నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. అయితే ఇతర వర్గాలు మాత్రం ఎలక్షన్ల కారణంగానే డిలే అవుతున్నాయని, ఈ వారంలో ఐపీఎల్ జీసీ ఏదో ఒక నిర్ణయం తీసుకుటుందని వెల్లడిస్తున్నాయి.

గుర్తుంచాల్సిన విషయం ఏంటంటే.. ఐపీఎల్ ప్రారంభానికి రెండు వారాలకంటే తక్కవ సమయమే ఉంది. అయితే మొదటి రెండు వారాల్లో మ్యాచ్‌లు నిర్వహించాల్సిన నగరాల జాబితా కూడా ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఐపీఎల్ నుంచి కానీ, బీసీసీఐ నుంచి కానీ ఈ వారంలో అప్‌డేట్ రాకుంటే మాత్రం ఇలాంటి ఊహాగానాలు మరింత ఊపందుకునే అవకాశాలు లేకపోలేదు.