Gold, Silver Prices| పెరిగిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలు, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల అస్థిరత కొనసాగుతుంది. మంగళవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 700పెరిగి రూ.1,62,380వద్ద కొనసాగుతుంది. అటు వెండి ధర సైతం మరోసారి పెరిగింది. కిలో వెండి ధర రూ. 10వేలు పెరిగి రూ. 3,00000లక్షలకు చేరింది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Mar 10, 2026, 12:33 pm IST
Read Time: 3 mins
Gold, Silver Prices| పెరిగిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలు, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల అస్థిరత కొనసాగుతుంది. మంగళవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 700పెరిగి రూ.1,62,380వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 650పెరిగి రూ. 1,48,850వద్ద నిలిచింది. అటు వెండి ధర సైతం మరోసారి పెరిగింది. కిలో వెండి ధర రూ. 10వేలు పెరిగి రూ. 3,00000లక్షలకు చేరింది.

మరోసారి బంగారం ధరలు పెరిగిపోవడంతో శుభకార్యాలకు బంగారాన్ని కొనాలనుకునే వారు పరిమితంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకున్న ఆందోళనకర పరిస్థితులు బంగారం ధరలపై విపరీతంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇరాన్ యుద్దం బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి పసిడి వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో పసిడి ధరలకు రెక్కలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

Mango Map | బంగినపల్లి నుంచి ఆల్ఫోన్సో వరకు.. భారత్‌లో దొరికే 14 మామిడి రకాల సీజన్ మ్యాప్ వైరల్!
Bellamkonda Srinivas | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి వార్తలకు ట్విస్ట్.. అది ఎంగేజ్‌మెంట్ కాదు, ఫ్యామిలీ వేడుక మాత్రమే!