Bellamkonda Srinivas | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి వార్తలకు ట్విస్ట్.. అది ఎంగేజ్‌మెంట్ కాదు, ఫ్యామిలీ వేడుక మాత్రమే!
Bellamkonda Srinivas | టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డి అనే యువతితో ఆయన వివాహ బంధంలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి.
Bellamkonda Srinivas | టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డి అనే యువతితో ఆయన వివాహ బంధంలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం బెల్లంకొండ ఇంట్లో జరిగిన ఒక వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది వారి నిశ్చితార్థం అని ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తలపై తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు.
సోమవారం సోషల్ మీడియా ద్వారా ఆయన తనకు కాబోయే సతీమణి కావ్య రెడ్డిని అధికారికంగా పరిచయం చేశారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని వ్యక్తపరుస్తూ ఒక భావోద్వేగ పోస్టును కూడా పంచుకున్నారు. “నా కావ్యమ్మతో కలిసి నా జీవితంలో కొత్త అందమైన అధ్యాయం ప్రారంభమవుతోంది. సరైన సమయంలో నా జీవితంలోకి వచ్చి నాపై విశ్వాసం ఉంచినందుకు, ప్రతిరోజూ పాజిటివిటీతో ఎన్నో చిరునవ్వులు పంచినందుకు ధన్యవాదాలు. నీ ముఖం మీద చిరునవ్వు ఎప్పటికీ మాయమవకుండా చూసుకుంటాను. మనం ఎప్పటికీ కలిసి ఉండే ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ బెల్లంకొండ భావోద్వేగంగా రాసుకొచ్చారు.
అదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. ఆదివారం జరిగిన కార్యక్రమం ఎంగేజ్‌మెంట్ కాదని, అది కేవలం కుటుంబ సభ్యులతో జరిగిన ఒక చిన్న వేడుక మాత్రమేనని తెలిపారు. ఇంకా అసలు నిశ్చితార్థం కార్యక్రమం జరగలేదని, త్వరలోనే అధికారికంగా తేదీలను ప్రకటిస్తానని వెల్లడించారు. అభిమానులు చూపుతున్న ప్రేమ, మద్దతు తనకు ఎంతో ముఖ్యమని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కావ్య రెడ్డితో కలిసి దిగిన కొన్ని అందమైన ఫోటోలను కూడా బెల్లంకొండ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ఇక ఆదివారం బెల్లంకొండ ఇంట్లో జరిగిన కార్యక్రమం రోకా వేడుక అని సమాచారం. ఈ వేడుకకు దర్శకులు వీవీ వినాయక్, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, హీరోయిన్ సంయుక్త, నిర్మాతలు హర్షితా రెడ్డి, సాహు గారపాటి, శిరీష్ రెడ్డి తదితర సినీ ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది.
కావ్య రెడ్డి నేపథ్యం గురించి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కుమార్తె కాగా, సినీ రంగంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని సమాచారం. కావ్య రెడ్డి చెల్లెలు మరియు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకే కాలేజీలో చదివారని తెలుస్తోంది. ఇద్దరూ క్లాస్‌మేట్స్ కావడంతో ఆ పరిచయం ద్వారా కావ్యతో బెల్లంకొండకు పరిచయం ఏర్పడిందని, తర్వాత అది ప్రేమగా మారిందని ప్రచారం జరుగుతోంది. ఇక ఉగాది తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ జంట పెళ్లి తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram