Mango Map | బంగినపల్లి నుంచి ఆల్ఫోన్సో వరకు.. భారత్‌లో దొరికే 14 మామిడి రకాల సీజన్ మ్యాప్ వైరల్!
Mango Map | సమ్మర్ వస్తుండటంతో మార్కెట్‌లోకి మామిడి పండ్ల రాక మొదలవుతోంది. ఈ క్రమంలోనే దేశంలో ఎన్ని రకాల మామిడి పండ్లు ఉన్నాయి? ఏ రకం ఎప్పుడు దొరుకుతుందో చెప్పే మ్యాంగో మ్యాప్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Mango Map | వేసవికాలంలో మాత్రమే దొరికే మామిడి అంటే కేవలం పండు మాత్రమే కాదు.. భారతీయులకు ఒక ఎమోషన్. ఏడాదిలో ఒక్క సీజన్‌లో మాత్రమే దొరికే మామిడి రుచిని ఆస్వాదించేందుకు ఎదురుచూసేవారు కోట్లలో ఉంటారు. సమ్మర్ మొదలవుతున్న నేపథ్యంలో దేశంలోని మామిడి పండ్లలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఏ రకం ఎప్పుడు దొరుకుతుందో తెలిపే మ్యాంగో మ్యాప్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
తోతాపురి
కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా లభించే ఈ మామిడి పసుపు రంగులో ఉంటుంది. తక్కువ తీపితో ఉండే దీన్ని పచ్చళ్లు, సలాడ్లకు వినియోగిస్తుంటారు. జూన్ నుంచి జులై వరకు దీని సీజన్ ఉంటుంది.
కేసర్
గుజరాత్‌లో ఎక్కువగా ఉండే ఈ మామిడి రకం గుజ్జు కుంకుమ రంగులో ఉండటం వల్ల కేసర్ అనే పేరు వచ్చింది. ఇది జూన్, జులై నెలల్లో మార్కెట్‌లో లభిస్తుంది.
నీలం
తమిళనాడు, కర్ణాటక, ఏపీలో పండే ఈ మామిడి హైదరాబాద్‌లో కూడా విస్తృతంగా లభిస్తుంది. తీపి, పులుపు కలగలిసిని రుచితో ఉండే ఈ రకం పండు మే నుంచి జూన్ వరకు లభిస్తుంది.
లంగ్రా
ఉత్తరప్రదేశ్‌లో ఈ మామిడి రకం ఎక్కువగా లభిస్తుంది. ఈ మామిడి పచ్చటి రంగులోనే పక్వానికి వస్తుంది. జూలై, ఆగస్టులో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
మాల్దా
బిహార్‌లో ఇది ఎక్కువగా లభిస్తుంది.
మల్గోవా
తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. గుండ్రంగా ఉండే ఈ పండు మే, జూన్ నెలల్లో మార్కెట్‌లో లభిస్తుంది. ఇది ఒక్కో పండు 500 గ్రాముల వకు బరువు ఉండటం విశేం.
హిమసాగర్
పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో లభించే ఈ రకం మామిడి చాలా తియ్యగా ఉంటుంది. మే, జూన్ మధ్య మాత్రమే ఇది దొరుకుతుంది.
ఆల్ఫోన్సో
మహారాష్ట్రలో విరివిగా పండే ఈ రకాన్ని కింగ్ ఆఫ్ మ్యాంగోస్ అని పిలుస్తారు. ఇది మే, జూన్‌లో ఎక్కువగా లభిస్తుంది.
సింధూర
ఈ రకం మామిడి తొక్క ఎరుపు రంగులో, లోపల గుజ్జు పసుపు రంగులో ఉంటుంది. తీపి, పులుపు కలయికలో ఉంటుంది.

బంగినపల్లి
ఏపీలోని కర్నూలు జిల్లా బనగానపల్లిలో ఎక్కువగా లభించే ఈ రకం మామిడికి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ రకం పండ్లు మార్కెట్‌లో కనిపిస్తాయి.
పయారి
కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో ఎక్కువగా ఉండే ఈ రకం మామిడి ఏప్రిల్ నుంచి జూన్ వరకు లభిస్తుంది. పసుపు రంగుతో పాటు స్వల్ప ఎరుపు మచ్చలతో ఉంటుంది.
చౌసా
ఉత్తర భారతదేశంలో ఈ రకం మామిడి పండ్లు ఎక్కువగా పండుతాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఈ పండ్లు మార్కెట్‌లో లభ్యమవుతాయి.
రసపురి
కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో విస్తృతంగా పండే ఈ మామిడి రకాన్ని క్వీన్ ఆఫ్ మ్యాంగోస్ అని పిలుస్తారు. మే నుంచి జూన్ వరకు వీటి సీజన్ ఉంటుంది.
బాదామి
కర్నాటకలో ప్రసిద్ధి చెందిన ఈ మామిడిని అక్కడి ఆల్ఫోన్సోగా పిలుస్తారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు ఇది లభిస్తుంది.
ఇలా దాదాపు 14 రకాలకు పైగానే మామిడి పండ్లు మన దేశంలో లభ్యమవుతాయి. అవన్నీ కూడా వాటి ప్రత్యేకమైన రుచులతో ఆకట్టుకుంటూనే ఉన్నాయి. మరి మీకు ఇష్టమైన మామిడి రకం ఏది?
Read More:
Doomsday Fish | మెక్సికో బీచ్‌కు కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తు ముంచెత్తనుందా?
Chai Guy | లేఆఫ్‌లో ఉద్యోగం పోతే.. అమెరికాలో ఛాయ్ అమ్ముతూ సక్సెస్ అయ్యాడు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram