Train Fare : రైలు టికెట్ ధర మా ఇష్టం అడగానికి మీరెవరు.. ఇది ట్రేడ్ సీక్రెట్

రైల్వే టికెట్ ధరల ఖరారు వివరాలు వెల్లడించలేమన్న రైల్వే బోర్డు. ఇది తమ "ట్రేడ్ సీక్రెట్" అని స్పష్టీకరణ. ఆర్టీఐ దరఖాస్తును తిరస్కరించిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్.

Train Fare

భారతీయ రైల్వేలో ఒక గమ్యస్థానం నుంచి మరో గమ్యస్థానానికి ప్రయాణించేందుకు టికెట్ ధరలు ఎలా ఖరారు చేస్తున్నారని, పాటిస్తున్న విధానం ఏంటని ఒకరు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించారు. ప్రశ్నకు వివరాలు ఇవ్వకుండా డొంక తిరుగుడు సమాధానం ఇచ్చింది. ఇది ట్రేడ్ సీక్రెట్ అని, ఆ వివరాలు వెల్లడించలేమని భారతీయ రైల్వే స్పష్టం చేయడం శోచనీయం.

ప్యాసింజర్ రైలు, ప్రత్యేక రైళ్లు, సూపర్ పాస్ట్ ఎక్స్ ప్రెస్ లలో టికెట్ ధరలు ఎలా నిర్ణయిస్తున్నారని, తత్కాల్ టికెట్ జారీకి ఏ విధానం అనుసరిస్తున్నారంటూ ఒక వ్యక్తి సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద వేసిన అప్పీల్ ను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) తిరస్కరించింది. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం వివరాలు వెల్లడించడం కుదరదని, తమ మేధో ఆస్తి అని రైల్వే బోర్డు సమర్థించుకుంటున్నది. జాతీయ భద్రత, వ్యక్తిగత గోప్యత, ట్రేడ్ సీక్రెట్ ప్రకారం వెల్లడించలేమని పేర్కొనడం గమనార్హం. జాతీయ ప్రయోజనాలు, సామాజిక బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని, ఆదాయం సమకూర్చుకునేందుకు వ్యాపారం చేస్తున్నామని రైల్వే బోర్డు ప్రకటించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు టికెట్ ధరల ఖరారు వివరాలు వెల్లడించలేమని రైల్వే బోర్డు చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ స్పష్టం చేశారు. ఇదే విధానాన్ని భారత పెట్రోలియం కంపెనీలు అనుసరిస్తున్నాయి. ఏ ప్రాతిపదికన పెట్రోల్, డీజిల్ ధరలు ఖరారు చేస్తున్నారనేది స్పష్టత ఇవ్వకుండా గజిబిజి లెక్కలతో దేశ ప్రజల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంధన ధరలు ఎందుకు పెంచుతున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే, అంతర్జాతీయ చమురు ధరలు పెరగడంతో పెంచక తప్పడం లేదని సమర్థించుకుంటున్నారు. చమురు ధరలు తగ్గితే ఆ ప్రకారం భారత పెట్రోలియం కంపెనీలు తగ్గించకుండా పాత ధరలనే అమలు చేస్తున్నాయి. పెట్రోలియం ధరల ఖరారు పై కేంద్రంలోని పెట్రోలియం మంత్రికి కూడా కనీస అవగాహన ఉండదంటున్నారు. ఈ గజిబిజి లెక్కలను చూసి ఆయన కూడా తలూపడం తప్ప ఏమి చేయలేరని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :


Gold Silver Prices : మరోసారి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Mahesh Babu | బెంగ‌ళూరులో ఓపెన్ అయిన మ‌హేష్ బాబు కొత్త థియేట‌ర్.. ఏ హీరో సినిమా ప్ర‌ద‌ర్శ‌న జరుపుకుంటుంది?

Latest News