విధాత, హైదరాబాద్ : కొత్త ఏడాది 2026లో హెచ్చుతగ్గుల మధ్య దూసుకెలుతున్న బంగారం, వెండి ధరలు సంక్రాంతి పండుగ తర్వాత శనివారం మరోసారి స్వల్పంగా పెరిగాయి. వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలతో ఆందోళన చెందుతున్న సామాన్యులకు ధరల స్వల్ప పెరుగుదల కాస్త ఊరటనిచ్చింది.
హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గి రూ.1,43,780వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.రూ.350 తగ్గి రూ.1,31,800వద్ద నిలిచింది.
రూ.4వేలు పెరిగిన కిలో వెండి ధర
వెండి ధరలు మరోసారి రూ.4000పైకి ఎగబాకాయి. కిలో వెండి ధర శనివారం హైదరాబాద్ మార్కెట్ లో మరోసారి రూ.3,10,000 మార్క్ కు చేరుకుంది. జనవరి 15న రూ.3లక్షల 10వేల ఆల్ టైమ్ రికార్డు ధర నమోదు చేసిన కిలో వెండి ధర తర్వాతా రూ.4వేలు తగ్గింది. ఒక రోజు వ్యవధిలోనే తిరిగి మళ్లీ రూ. 3లక్షల 10వేల మార్కుకు చేరుకోవడం గమనార్హం.
జవవరి 1వ తేదీన కిలో వెండి ధర రూ.2,56,000వద్ద నిలిచింది. 17రోజులలోనే కిలో వెండి ధరపై రూ.54వేల పెరుగుదలను నమోదు కావడం విశేషం. 13 నెలల్లో వెండి 210 శాతం పెరిగిపోయిన తీరు చూస్తే వెండి ధరలు భవిష్యత్తులో మరింత పైకి ఎదిగి త్వరలోనే రూ.3.50లక్షలకు చేరుకుంటుందని, అలాగే బంగారం తులం ధర రూ.1.50లక్షలకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Kawah Ijen | అత్యంత ప్రమాదకర ‘ఆమ్ల సరస్సు’ – తాకితే బూడిదే : ఎక్కడో తెలుసా?
NTR- Ram Charan | ‘ఎన్టీఆర్ గురించి విచిత్ర కామెంట్స్’.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్
