విధాత: గడ్టకట్టిన సరస్సులోని ఐస్ పలకలపై నిలుచుని ఫోటోల కోసం చేసిన ప్రయత్నం విషాదాంతమై ఇద్దరు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అరుణాచల్ ప్రదేశ్ లో గడ్డకట్టిన సరస్సులో కేరళాకు చెందిన ఇద్దరు పర్యాటకులు ఫోటోల కోసం దిగారు. సరస్సులోని గడ్డకట్టిన మంచు గడ్డలపై నిలుచుని ఫోటోలు దిగుతుండగా..హఠాత్తుగా మంచుగడ్డలు విరిగిపోయి..పర్యాటకులు నీటిలో పడిపోయారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు ఒక మృత దేహాన్ని పైకి తీసిన అధికారులు, మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
