Site icon vidhaatha

Hanuman: కొండ‌ల్లో బండ‌రాయిపై హ‌నుమాన్ స్వ‌రూపం.. చూసి త‌రించాల్సిందే! ఎక్క‌డంటే

Hanuman:

విధాత : హిందు ఆలయాలలో దేవుడి విగ్రహాలు కొన్ని మానవ నిర్మితాలైతే..మరికొన్ని స్వయంభూగా కొలువైనవి. స్వయంభూ దేవతా మూర్తులను అన్నిటికంటే పవిత్రంగా భావించి ఆరాధిస్తుంటారు హిందువులు. అలాంటి స్వయంభూ హనుమాన్ (Hanuman) దేవతా స్వరూపం భారీ కొండలలో సహజంగా ఆవిర్భవించిన అద్భుతం దేశంలో ఆవిష్కృతమై ఉంది. ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుకా పట్టణం పర్వత ప్రాంతాల్లో మనం హనుమాన్ దివ్య స్వరూపాన్ని దర్శించవచ్చు.

ఇండో చైనా సరిహద్దు పశ్చిమ సియాంగ్ జిల్లాలోని అందమైన లోయ అయిన మెచుకా పట్టణం నుంచి యార్లుంగ్ ఆర్మీ క్యాంప్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో ఒక చిన్న హనుమాన్ ఆలయం కొలువై ఉంది. అక్కడ ఎదురుగా ఉన్న కఠినమైన పర్వత శిఖరంపై సహజంగా ఏర్పడిన హనుమంతుని ముఖాన్ని మనం దర్శించవచ్చు. మెచుకా లాలో ఇది అత్యంత పురాతన పర్వతం. ఆలయానికి, పర్వత ప్రాంతానికి వెళ్లే దారుల్లో భారత సైన్యం శిబిరాలు ఉంటాయి. ప్రత్యేక అనుమతితోనే ఈ ప్రాంతంలో పర్యటించాల్సి ఉంటుంది. సరిహద్దులో ఉన్న యార్లుంగ్ ఆర్మీ క్యాంపుకు వెళ్లే మార్గంలో ఆర్మీ నిర్వహించే హనుమాన్ ఆలయం, గురుద్వారా అవతల, గురునానక్ జీ ముద్రలు కలిగిన గురునానక్ తపోస్థాన్ ఉంది.

తపోస్థాన్‌లోకి ప్రవేశించడానికి పర్వతంలోని ఇరుకైన మార్గం గుండా వెళ్ళాల్సి ఉంటుంది. అది నదీ తీరంలోని అడవిలోకి వెలుతుంది. పాపులైతే ఆ మార్గాన్ని దాటలేరనే పురాణం ఉంది. కాగా మెచుకలా పర్వతాల్లోని కొండపై వెలసిన హనుమాన్ స్వరూపం తిరుమల తిరుపతి ఏడు కొండల్లో శ్రీ వెంకటేశ్వరుడి స్వరూపాన్ని స్ఫూరింపచేసినట్లుగా మనకు కనువిందు చేస్తూ ఆధ్యాత్మిక అనుభూతిలో విహరింప చేస్తుంది. తిరుమల కొండపై శ్రీవారి సహజ శిల వెంకటేశ్వరుడి భారీ విగ్రహంగా, శ్రీవారి మోము, తలపై కిరీటంతో ఓ చెక్కిన శిల్పంలా సాక్షాత్కరిస్తుంది. దూరం నుంచి చూస్తే శ్రీవారి రూపం స్పష్టంగా కనిపిస్తుంది. రెండో ఘాట్ రోడ్డు చివరి మలుపు నుంచి గమనిస్తే దూరంగా శ్రీవారి సహజ శిల కనబడుతుంది. ఇక్కడ తరచూ పూజలు చేస్తారు. కొండ అంచు పైనుంచి జారి పడే ప్రమాదం పొంచి ఉండటంతో.. నడుముకు తాళ్లు కట్టుకొని కైంకర్యాలు నిర్వహిస్తారు. తిరుమల కొండపై శ్రీవారి సహజ శిలతో పాటు గరుడ పర్వతం, శిలా తోరణం కూడా సహజ సిద్ధంగా ఏర్పడినవే. గరుడ పర్వతం గరుడ పక్షి ఆకారంలో ఉంటుంది.

Exit mobile version