విధాత, హైదరాబాద్ : కొన్ని నెలలుగా రికార్డు పెరుగుదలను నమోదు చేస్తున్న వెండి, బంగారం ధరలు ఆదివారం మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా నిలకడగా ఉండిపోయాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,60,260వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,46,900గా ఉంది.
వెండి ధరలు సైతం నిన్నటి ధర వద్దనే నిలిచాయి. ఆదివారం కిలో వెండి ధర రూ.3,65,000గా ఉంది. అయితే వెండి, బంగారం ధరలు మునముందు పెరుగదలను నమోదు చేస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో వివాహాది శుభకార్యాలు రానుండటం, బడ్జెట్ ఇయర్ సమీపిస్తుండటం, అంతర్జాతీయ పరిణామాలు వంటి అంశాలు వెండి, బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతుున్నారు.ఇదే ఏడాదిలో బంగారం తులం రూ.2లక్షలకు, వెండి 4లక్షల మార్క్ ను చేరవచ్చంటున్నారు. ప్రముఖ పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి వెండి ధరలు ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో బంగారం కంటే కూడా వేగంగా పెరుగుతాయని, ఔన్స్ వెండి ధర 200డాలర్లకు చేరవచ్చని అంచనా వేశారు.
ఇవి కూడా చదవండి :
Crime News : ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టి…ప్రియురాలి ఆత్మాహత్య యత్నం
Nampally : నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృతదేహాల వెలికితీత
