NTR- Ram Charan |టాలీవుడ్‌లో “మ్యాన్ ఆఫ్ మాసెస్”గా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెరపై ఆయన చూపించే ఎనర్జీ, భావోద్వేగాల ప్రదర్శన, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. నటనతో పాటు నృత్యంలోనూ, పాటల పట్ల ఉన్న ఆసక్తితో గాయకుడిగా కూడా తనలోని మరో కోణాన్ని అప్పుడప్పుడు బయటపెడతారు. ఇలా ఎన్నో టాలెంట్స్‌తో అభిమానులను అలరిస్తున్న ఎన్టీఆర్ గురించి తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
“మీకు ఒక పవర్‌ఫుల్ కారు ఇస్తే, ఏ కో–స్టార్‌తో డ్రైవ్‌కు వెళ్లాలనుకుంటారు? ఆ సమయంలో మీరు ప్యాసింజర్ సీట్‌లో కూర్చోవాల్సి వస్తే ఎవరి డ్రైవింగ్‌పై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది?” అనే ప్రశ్నకు రామ్ చరణ్ ఏమాత్రం ఆలోచించకుండా ఎన్టీఆర్ పేరును చెప్పడం విశేషం. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, “ఎన్టీఆర్ ఒక మ్యాడ్ డ్రైవర్. అతనితో డ్రైవ్ చేసిన చాలామంది ఇదే మాట చెప్పారు. అతని డ్రైవింగ్ చాలా ఎనర్జీగా, ఇంటెన్స్‌గా ఉంటుంది” అంటూ సరదాగా కామెంట్ చేశాడు. చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు క్షణాల్లోనే నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఎన్టీఆర్‌ను నటుడు, డాన్సర్, సింగర్‌గా మాత్రమే చూసిన అభిమానులు, ఇప్పుడు ఆయన డ్రైవింగ్ స్కిల్స్ గురించి కూడా చర్చ మొదలుపెట్టారు.
“తారక్‌లో ఇలాంటి మరో టాలెంట్ కూడా ఉందా?” అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతూ సరదా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత చరణ్–ఎన్టీఆర్ స్నేహం మరింత బలపడిందని ఈ మాటలు చాటుతున్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, రామ్ చరణ్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు ఎన్టీఆర్ గురించి కొత్త కోణాన్ని బయటపెట్టడమే కాకుండా, అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ ఎనర్జీకి మారుపేరుగా ఎన్టీఆర్ ఉంటాడని మరోసారి రుజువైనట్లైంది.
