విధాత: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ టి.ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులు ఊరట దక్కింది.
ప్రభాకర్ రావుకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ను సుప్రీంకోర్టుమంజూరు చేసింది. జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్నది. కేసు దర్యాప్తులో సాధించిన పురోగతిని పరిశీలించింది. కొద్ది వారాల్లో అదనపు ఛార్జ్ షిట్ దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా తన వాదనలను వినిపించారు. ప్రభాకర్ రావు బెయిల్ ఇవ్వరాదంటూ వాదనలు వినిపించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు అవసరమని.. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే కీలక సమాచారాన్ని తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు. ఉభయ పక్షాల వాదనలు విన్న ధర్మాసనం దర్యాప్తునకు సహకరించాలని ప్రభాకర్ రావుకు సూచనలు చేసింది. సాక్ష్యాలు, ఆధారాలు ట్యాంపర్ చేస్తే ముందస్తు బెయిల్ రద్దు అవుతుందని ప్రభాకర్ రావును హెచ్చరించింది. కోర్టు అనుమతి లేకుండా రాష్ట్రం, దేశం దాటడానికి వీళ్లేదని పేర్కొంది. అరెస్ట్, కస్టడీల నుంచి మినహాయింపు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి :
అసెంబ్లీ సమరానికి కాంగ్రెస్… బీఆర్ఎస్ సన్నాహాలు!
Arasavalli : అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు!
