అసెంబ్లీ సమరానికి కాంగ్రెస్… బీఆర్ఎస్ సన్నాహాలు!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహా ప్రతివ్యూహాలతో, సకల అస్త్రశస్త్రాలతో సన్నద్దమతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల సన్నాహాలు చూస్తుంటే బడ్జెట్ సమావేశాలు వేసవి ఎండల తీవ్రత కంటే కూడా ఎక్కువగానే వాడివేడిగా సాగుబోతున్నాయన్న సంకేతాలను అందిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16వ తేదీన (సోమవారం) ఉదయం 11.45 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలుత అసెంబ్లీ హాల్‌లో శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే నోటిఫికేషన్‌ను జారీ కాబడింది. 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఇప్పటికే ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివిధ ప్రభుత్వం శాఖల అధికారులు, మంత్రులతో వరుసగా ప్రీ బడ్జెట్ భేటీలు కొనసాగిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం వైపు నుంచి బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలను చాటుతుంది.
సర్కార్ పై సమరానికి బీఆర్ఎస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయడంలో అనుసరించాల్సిన వ్యూహా ప్రతివ్యూహాలపై బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏకంగా గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో వర్క్ షాపు నిర్వహించి శిక్షణ ఇవ్వడం గమనార్హం.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్లు సబితా ఇంద్రారెడ్డి ,తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ విప్ వివేకానంద ప్రభృతులు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, నియమనిబంధనలు (రూల్ బుక్), రాజ్యాంగ అంశాలపై అవగాహన కల్పించారు. కౌన్సిల్ వైస్ చైర్మన్ బండ ప్రకాష్, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తోపాటు పలువురు సీనియర్ నేతలు ప్రసంగించారు. ముగింపు సెషన్ లో కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గదర్శకం చేశారు.
బడ్జెట్ సమావేశాలకు అధికార, ప్రతిపక్ష పార్టీల కసరత్తులు చూస్తే ఈ ధఫా సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలపైన, రైతు భరోసా పెండింగ్ పైన, కాళేశ్వరం మరమ్మతులు, మూసీ నది సుందరీకరణ, హిల్ట్ పాలసీ, భూ భారతి, కొత్త అప్పులు, యూరియా యాప్, వెలుగుమట్ల భూదాన్ భూముల ఇళ్లకూల్చివేత వంటి అంశాలతో దాడి చేయనుందని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :
Om Birla : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..కొనసాగుతున్న చర్చ
BCCI Announce Cash Reward : టీ 20వరల్డ్ కప్ విజేత టీమిండియాకు బీసీసీఐ భారీ నజరాన!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram