విధాత : రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు. చర్లపల్లి – ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ విషాదకర ఘటన జరిగింది. ఎంఎంటీఎస్ డౌన్‌లైన్‌లో తల్లి, ఇద్దరు పిల్లలు బలవన్మరణానికి పాల్పడినట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన పిన్నింటి విజయశాంతి రెడ్డి(35), విశాల్ రెడ్డి(17), చైతన్య రెడ్డి(15)గా తెలుస్తోంది.
గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీ వాసులుగా గుర్తించారు. మృతుల వద్ద ఎలాంటి ప్రయాణ టికెట్లు లభించలేదు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి.. రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి బలవన్మరనానికి కారణాలు తెలియరాలేదు. ఆర్థికపరమైన ఇబ్బందులేమైనా ఉన్నాయా? ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో గాల్వాన్ అమరవీరుడి మాతృమూర్తి
Aishwarya Rajesh | నన్ను ఆ దర్శకుడు నైటీలో చూడాలని అన్నాడు.. దర్శకుడి ప్రవర్తనతో విసిగిపోయానన్న హీరోయిన్
