Osmania University | ఉస్మానియా యూనివ‌ర్సిటీలో మ‌ళ్లీ క‌ట్టెల పొయ్యిలు..! పూరీ, వ‌డ‌, రోటీ బంద్..!!

Osmania University | గ‌తేడాది వ‌ర‌కు క‌ట్టెల పొయ్యి మీద‌నే వంట చేసిన ఉస్మానియా యూనివ‌ర్సిటీ హాస్ట‌ళ్ల‌లో.. మ‌ళ్లీ ఇప్పుడు అదే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎందుకంటే క‌మర్షియ‌ల్ గ్యాస్ కొర‌త కార‌ణంగా.. ఓయూలోని 18 హాస్ట‌ళ్ల‌ల్లో క‌ట్టెల పొయ్యి మీద‌నే వంట చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

Osmania University | గ‌తేడాది వ‌ర‌కు క‌ట్టెల పొయ్యి మీద‌నే వంట చేసిన ఉస్మానియా యూనివ‌ర్సిటీ హాస్ట‌ళ్ల‌లో.. మ‌ళ్లీ ఇప్పుడు అదే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎందుకంటే క‌మర్షియ‌ల్ గ్యాస్ కొర‌త కార‌ణంగా.. ఓయూలోని 18 హాస్ట‌ళ్ల‌ల్లో క‌ట్టెల పొయ్యి మీద‌నే వంట చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. నిన్న‌టి నుంచి ఆయా హాస్ట‌ళ్ల‌లో క‌ట్టెల పొయ్యి మీద‌నే ఆహారం త‌యారు చేసి విద్యార్థుల‌కు వ‌డ్డిస్తున్నారు.

ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో గ్యాస్ అధికంగా వినియోగ‌మ‌య్యే పూరీ, వ‌డ‌, రోటీ వంటి వంట‌కాల‌ను తాత్కాలికంగా నిలిపివేయాల‌ని ఓయూ అధికార యంత్రాంగం నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. మిగ‌తా వంట‌కాల‌ను త‌యారు చేసి విద్యార్థుల‌కు వ‌డ్డించాల‌ని నిర్ణ‌యించారు. 18 హాస్ట‌ళ్ల ప‌రిధిలో 8 వేల మంది విద్యార్థులు ఉంటున్నార‌ని, వారి మెనూకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామ‌ని తెలిపారు. గ్యాస్ కొర‌త కార‌ణంగా ప్ర‌త్యామ్నాయంగా క‌ట్టెల పొయ్యిలు ఏర్పాటు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

వ‌ర్క‌ర్ల‌కు ఇబ్బంది క‌ల‌గొద్ద‌ని..

గ‌తేడాది వ‌ర‌కు ఉస్మానియా యూనివ‌ర్సిటీ హాస్ట‌ళ్ల‌ల్లో క‌ట్టెల పొయ్యి మీద‌నే వంట‌లు చేసేవారు. మెస్ వ‌ర్క‌ర్ల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన క‌ట్టెల పొయ్యిల‌ను యూనివ‌ర్సిటీ అధికారులు తొల‌గించారు. 18 హాస్ట‌ళ్ల ప‌రిధిలోని కిచెన్‌ల‌ను ఆధునీక‌రించి.. క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్ప‌ట్నుంచి గ్యాస్ స‌హాయంతోనే వంట‌లు చేసి విద్యార్థుల‌కు వ‌డ్డిస్తున్నారు. తాజా యుద్ధం ప‌రిస్థితుల నేప‌థ్యంలో వంట గ్యాస్ కొర‌త ఏర్ప‌డ‌డంతో.. మ‌ళ్లీ క‌ట్టెల పొయ్యిల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.

Latest News