Monalisa | ఎట్ట‌కేల‌కి ప్రేమ పెళ్లి చేసుకున్న మోనాలిసా భోస్లే .. వ‌రుడు ఎవ‌రు, ఎలా పరిచయం..!

Monalisa | కుంభమేళా సమ‌యంలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారిన యువతి మోనాలిసా భోస్లే ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఓ ఆలయంలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె వివాహం చేసుకుంది. ఈ వివాహ వేడుకకు కేరళ మంత్రి వి. శివన్‌కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం. వి. గోవిందన్ హాజరైనట్లు సమాచారం.

Monalisa | కుంభమేళా సమ‌యంలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారిన యువతి మోనాలిసా భోస్లే ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఓ ఆలయంలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె వివాహం చేసుకుంది. ఈ వివాహ వేడుకకు కేరళ మంత్రి వి. శివన్‌కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం. వి. గోవిందన్ హాజరైనట్లు సమాచారం. పెళ్లికి ముందు మోనాలిసా తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తామిద్దరం ప్రేమించుకున్నామని, అయితే తన తల్లిదండ్రులు ఈ ప్రేమను ఒప్పుకోవడం లేదని ఆమె తెలిపింది. తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం ఉండవచ్చని భావించి పోలీసుల రక్షణ కోరింది. అనంతరం పోలీసులు భద్రత కల్పించడంతో ఈ జంట ఆలయానికి వెళ్లి వివాహం చేసుకున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన మోనాలిసాకు మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్‌తో సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు ఏడాదిన్నరగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ ఇద్దరి మతాలు వేర్వేరు కావడంతో మోనాలిసా తల్లిదండ్రులు ఈ వివాహానికి అంగీకరించలేదు. ఇటీవల మోనాలిసా ఓ సినిమా చిత్రీకరణ కోసం కేరళకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి కూడా అక్కడికి వెళ్ల‌గా, అక్క‌డ‌ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మోనాలిసా తన ప్రియుడితో కలిసి తిరువనంతపురానికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన తండ్రి ఫర్మాన్ ఖాన్‌తో పెళ్లికి ఒప్పుకోవడం లేదని, మరొక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపింది. తాను మాత్రం ఫర్మాన్ ఖాన్‌తోనే జీవించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది. దీంతో పోలీసులు ఆ జంటకు భద్రత కల్పించారు. అనంతరం తిరువనంతపురంలోని ఓ ఆలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి సినిమా చిత్రీకరణ బృందం సభ్యులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా హాజరైనట్లు సమాచారం. కుంభమేళా సమయంలో పూసలు అమ్ముతూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే ఇప్పుడు తన ప్రేమను పెళ్లిగా మార్చుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ వివాహం గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Latest News