బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025: 71 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 71 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదలైంది. ఇద్దరు డిప్యూటీ సీఎంలకు ఫస్ట్ లిస్ట్‌లో చోటు దక్కింది.

బీహార్ అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ మంగళవారం నాడు విడుదల చేసింది. తొలి జాబితాలో 71 మందికి చోటు లభించింది. బీహార్ రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ఉన్న ఇద్దరికి బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో చోటు దక్కింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరిన మరునాడే బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసింది.