న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ సోమవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇదే లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు వాదనలు విననున్న నేపథ్యంలో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేయడం గమనార్హం. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులోని స్పెషల్ సీబీఐ కోర్టులో దర్యాప్తు అధికారులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఈడీ కేసులో తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రూపొందించిన లిక్కర్ పాలసీలో అవినీతి అంశంలో సీబీఐ దర్యాప్తు చేస్తుండగా.. ఈ అంశంలో మనీలాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తున్నది.
ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన.. అనంతరం రద్దు చేసిన లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో సీబీఐ అధికారులు తీహార్ జైల్లో కేజ్రీవాల్‌ను జూన్ 26న అరెస్టు చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్‌తోపాటు ఆప్ నేత మనీశ్ సిసోడియా, బీఆరెస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కూడా నిందితులుగా ఉన్నారు. ఈడీ కేసులో ఇటీవలే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసులలో మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారించనున్నది.
Liquor Policy Case | లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై సీబీఐ చార్జ్‌షీట్
లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ సోమవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇదే లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు వాదనలు విననున్న నేపథ్యంలో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేయడం గమనార్హం.

Latest News
U19 ప్రపంచకప్ 2026: హెనిల్ పటేల్ అయిదు వికెట్లతో భారత్ ఘన విజయం
హర్లీన్ దియోల్ అద్భుత అర్ధ సెంచరీ – ముంబైపై యూపీ ఘన విజయం
విజయ్ ‘జన నాయగన్’కు సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ
సింగర్ సునీత.. కొడుకు హీరోగా మరో చిత్రం
మహా శివరాత్రికి పురాణపండ ' శంభో మహాదేవ "
పార్టీ మారినట్లు ఆధారాల్లేవ్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్
బడ్జెట్ 2026 : నిర్మలా సీతారామన్ ఏమివ్వనుంది?
తెలుగింటి బాపు బొమ్మలా.. లంగా వోణీలో శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూడండి!
సంక్రాంతి అల్లుడికి 158రకాల వంటలతో విందు..వైరల్
ఒక్క లవంగం: నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలకు సహజ పరిష్కారం