Metro Rail | మే 25న ఉద‌యం 4 గంట‌ల‌కే మెట్రో రైళ్లు ప‌రుగులు..!

Metro Rail | దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఏడు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఈ నెల 25వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ మెట్రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఓట‌ర్ల‌ను దృష్టిలో ఉంచుకుని 25వ తేదీన తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచే మెట్రో రైళ్ల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించారు.

  • Publish Date - May 23, 2024 / 09:56 AM IST

Metro Rail | న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఏడు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఈ నెల 25వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ మెట్రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఓట‌ర్ల‌ను దృష్టిలో ఉంచుకుని 25వ తేదీన తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచే మెట్రో రైళ్ల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించారు. ఆ రోజున ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు 30 నిమిషాల‌కు ఓ రైలు న‌డ‌పాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఉద‌యం 6 గంట‌ల త‌ర్వాత ప్ర‌తి రోజు మాదిరిగానే మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయ‌ని అధికారులు పేర్కొన్నారు.

ఇక ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ కూడా మే 25న ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచి 35 మార్గాల్లో ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నున్నారు. ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మ‌ల్టీ మోడ‌ల్ ట్రాన్సిట్ సిస్ట‌మ్ లిమిటెడ్ కూడా 46 మార్గాల్లో ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నుంది.

ఢిల్లీలోని చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, న్యూఢిల్లీ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. బీజేపీకి ఇండియా కూట‌మికి మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ ఉంది. ఇండియా కూట‌మి త‌ర‌పున కాంగ్రెస్, ఆప్ పార్టీలు పోటీ చేస్తున్నాయి.

Latest News