Delhi Metro : షాకింగ్‌.. ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫామ్‌పైనే మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. నెట్టింట విమర్శలు

ఢిల్లీ మెట్రోలో మరో ఘోరం! ప్లాట్‌ఫామ్‌పైనే మూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడు. వైరల్ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం. నిందితుడి కోసం గాలిస్తున్న డీఎంఆర్‌సీ అధికారులు.

Delhi Metro

కొన్ని రోజులుగా ఢిల్లీ మెట్రో (Delhi Metro) తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రయాణికుల అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ప్రయాణికుల మధ్య ఘర్షణలు వంటి వీడియోలు నెట్టింట చర్చకు దారితీశాయి. తాజాగా ఇప్పుడు మరోసారి ఢిల్లీ మెట్రో హెడ్‌లైన్స్‌లో నిలిచింది. అందుకు కారణం ఓ ప్రయాణికుడు చేసిన పనే.

ఢిల్లీ మెట్రో రైలులో నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులతో రాజధానిలోని మెట్రో స్టేషన్లు రద్దీగా ఉంటాయి. అయితే, ఇంత రద్దీలోనూ ఓ వ్యక్తి చేసిన పని ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? ఓ ప్రయాణికుడు ప్లాట్‌ఫామ్‌పైనే మూత్ర విసర్జన చేశాడు. దేశ ప్రజల్లో రోజురోజుకీ సివిక్ సెన్స్ (Civic Sense) తగ్గిపోతోంది అని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే, ఈ ఘటన ఎప్పుడు, ఏ మెట్రో స్టేషన్‌లో జరిగిందన్నదానిపై స్పష్టత లేదు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. ఢిల్లీ మెట్రో స్టేషన్ పింక్ లైన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మెట్రో ప్లాట్‌ఫామ్‌ అంచున నిలబడి మూత్ర విసర్జన చేశాడు. అటుగా వెళ్తున్న కొందరు ఈ విషయాన్ని గుర్తించి వీడియో తీసి దాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. ఇది చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఎంతో గొప్ప పేరున్న ఢిల్లీ లాంటి మహా నగరంలో ఇలాంటి పనులు చేయడం వల్ల సిటీ ఇమేజ్ దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో
రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) స్పందించింది. ‘మెట్రో ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రయాణికులు సహకరించాలి. తోటి ప్రయాణికులు ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే డీఎంఆర్‌సీ అధికారుల దృష్టికి తీసుకురావాలి’ అని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వీడియో ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Etela Rajendar : భూ చట్టాల అమలు లోసుగులతోనే భూ వివాదాలు జఠిలం
King Cobra | కింగ్ కోబ్రా క్యాచింగ్.. బిగ్ డేరింగ్ !

Latest News