King Cobra | అత్యంత విషపూరితమైన పాము జాతులలో కింగ్ కోబ్రా అగ్రగామి. కింగ్ కోబ్రాను చూస్తేనే ఒణికిపోయి గుండె ఆగినంత టెన్షన్ పడుతుంటారు కొందరు జనం. అయితే భారత్ లోని జనావాసాల్లోకి వచ్చిన అరుదైన గోదుమ రంగు భారీ కింగ్ కోబ్రాను అత్యంత సాహసోపేతంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ నైపుణ్యం వైరల్ గా మారింది. ఆ గ్రామీణ స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్న వీడియో చూస్తే ఇండోనేషియా దేశంలోని ప్రమాదకర కింగ్ కోబ్రాలు, అనకొండలను పట్టుకునే ప్రముఖ స్నేక్ క్యాచర్ల సాహసం గుర్తుకు రాక తప్పదు.
ఇకపోతే భారత్ లోని జనావాసా ప్రాంతాల్లోకి వచ్చిన ఓ బ్రౌన్ బిగ్ కింగ్ కోబ్రాను రూరల్ ఇండియన్ స్నేక్ క్యాచర్ ప్రశాంతంగా పట్టుకుని, అటవీ మార్గంలో తరలించారు. 5.8 మీటర్ల పొడవున్న పొడవైన విషపూరిత భారీ కింగ్ కోబ్రాను ఒట్టి చేతులతో సురక్షితంగా బంధించిన అతడి నైపుణ్యం అబ్బురపరుచింది. అదే సమయంలో ఏ మాత్రం తేడా వచ్చిన నిమిషాల్లో ప్రాణాన్ని హరించ న్యూరోటాక్సిక్ విషాన్ని కలిగిన కింగ్ కోబ్రా కాటుకు బలికాక తప్పదన్న వాస్తవాన్ని తలుచుకుంటే భయం పుట్టకమానదు.
Dhurandhar.. pic.twitter.com/t76giZx3RF
— Deepak Prabhu (@ragiiing_bull) January 19, 2026
ఇవి కూడా చదవండి :
Trump Threatens France : ఫ్రాన్స్‌పై ట్రంప్ కన్నెర్ర.. 200 శాతం టారిఫ్‌లు విధిస్తానంటూ బెదిరింపులు
Kavitha : మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి పోటీ!
