Uttarakhand | ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్ర‌య‌ణికుల‌తో వెళుతున్న టెంపో ట్రావెలర్ రుద్ర‌ప్ర‌యాగ్‌ జిల్లాలోని అలకానంద నదిలో పడి ఎనిమిది మందిని మృలి చెందారు

  • Publish Date - June 15, 2024 / 04:48 PM IST

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్ర‌య‌ణికుల‌తో వెళుతున్న టెంపో ట్రావెలర్ రుద్ర‌ప్ర‌యాగ్‌ జిల్లాలోని అలకానంద నదిలో పడి ఎనిమిది మందిని మృలి చెందారు. మరో 14 మంది వరకూ గాయపడ్డారు. టెంపోలో సుమారు 22 మంది ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రకృతి విపరీత్యాల సంస్థ బృందం కమాండెంట్‌ మణికాంత్ మిశ్రా తెలిపారు.

కమాండెంట్‌ మణికాంత్ మిశ్రా తెలిపిన‌ సమాచారం మేర‌కు ఘజియాబాద్ నుండి చోప్టాకు టెంపో వెళ్తుండ‌గా ఉద‌యం 11:30 గంట‌ల ప్రాంతంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. రుద్ర‌ప్ర‌యాగ్ సిటీ నుంచి ఒక చిన్న మలుపు తిరుగుతుండగా వాహనం అదుపుత‌ప్పి న‌దిలోకి దూసుకెళ్లింద‌ని మిశ్రా తెలిపారు. కాగా.. తమ సిబ్బంది కాపాడిన వారిలో చాలా మంది పరిస్థితి నిలకడగా ఉందని, నలుగురు తీవ్రంగా గాయపడడంతో వారికి రిషికేష్‌లోని ఎయిమ్స్‌కు త‌ర‌లించామని చెప్పారు. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది ఢిల్లీకి చెందినవారు ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా.. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఉత్తరాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. స్థానిక అధికార యంత్రాంగం ఎస్‌డీఆర్ఎఫ్‌ బృందాలు సహాయక చర్య‌ల్లో పాల్గొంటున్నాయ‌ని తెలిపారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. క్ష‌త‌గాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు.

Latest News