India’s next-gen ePassport explained: How to apply, eligibility, benefits, key differences, rollout cities & PSP 2.0 upgrades
ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టుల జారీ ప్రారంభం – దిగ్గజదేశాల సరసన భారత్
- ఇప్పటి పాస్‌పోర్టుకు, ఈ–పాస్‌పోర్టుకు తేడా ఏంటి?
- ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరు అర్హులు?
- పూర్తి సమాచారం ఇప్పుడు.. ఇక్కడే..
(విధాత నేషనల్ డెస్క్), హైదరాబాద్:
India’s new e-Passport | భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రాం 2.0 (PSP V2.0) కింద కొత్త తరహా RFID చిప్ ఆధారిత ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్ (ఈ-పాస్‌పోర్ట్)లను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. పాస్‌పోర్ట్ కవర్ వెనుక పేజీ(2వ పేజీ)లో అమర్చిన మైక్రోచిప్ + యాంటెన్నా ద్వారా యజమాని వ్యక్తిగత వివరాలు, ఫోటో, వేలిముద్రలు, డిజిటల్ సంతకం—అన్నీ encrypted formatలో భద్రపరచబడతాయి. ఈ సాంకేతికత ద్వారా నకిలీ పాస్‌పోర్ట్‌లను పూర్తిగా నివారించి, ఇమిగ్రేషన్ మరింత త్వరితగతిన పూర్తయ్యేలా వీలు కల్పిస్తుంది.
ఇది కేవలం పాస్‌పోర్ట్ అప్‌గ్రేడ్ మాత్రమే కాదు—భారత పాస్‌పోర్ట్‌ను ICAO (International Civil Aviation Organization) అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా రూపుదిద్దిన విప్లవాత్మక మార్పు. దీని వల్ల విమానాశ్రయాల్లో automated e-Gates ద్వారా ఇమిగ్రేషన్ కొన్ని సెకండ్లలోనే పూర్తవుతుంది. ప్రస్తుతం భారత్ సహా 178 దేశాల్లో ఈ–పాస్‌పోర్ట్ సౌలభ్యం అందుబాటులో ఉంది.
భారత విదేశాంగశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం:
✔️ భారతదేశంలో 80 లక్షలకు పైగా ఈ-పాస్‌పోర్ట్‌లు ఇప్పటికే జారీ అయ్యాయి
✔️ విదేశీ రాయబార కార్యాలయాల ద్వారా 62,000+ పాస్‌పోర్ట్‌లు ఇచ్చారు.
✔️ 2035 నాటికి దేశంలోని అన్ని పాస్‌పోర్ట్‌లు పూర్తిగా ఈ-పాస్‌పోర్ట్‌లుగా మారిపోతాయి.
పాస్‌పోర్ట్ సేవ 2.0లో AI ఆధారిత సిస్టమ్‌లు, చాట్/వాయిస్ బాట్స్, UPI/QR పేమెంట్స్, ఆటో ఫిల్, డాక్యుమెంట్ అనాలిసిస్, ఫేషియల్ మాచింగ్ అలర్ట్స్, డిజీ లాకర్ ఇంటిగ్రేషన్ వంటి సౌకర్యాలు జోడించబడ్డాయి. ఈ మొత్తం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను TCS (Tata Consultancy Services)అభివృద్ధి చేసింది.
సాధారణ పాస్‌పోర్ట్‌తో ఈ-పాస్‌పోర్ట్ తేడా ఏమిటి?
సాధారణ పాస్‌పోర్ట్
- కాగితం పైనే వ్యక్తిగత వివరాలు
- బయోమెట్రిక్ డేటా చిప్‌లో ఉండదు
- మాన్యువల్ ఇమిగ్రేషన్ చెకింగ్
- నకిలీల ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేం
ఈ-పాస్‌పోర్ట్
- వెనుక భాగంలో RFID చిప్ + యాంటెన్నా
- ఫోటో, ఫింగర్‌ప్రింట్స్, సంతకం—అన్నీ digitally signed
- PKI (Public Key Infrastructure) encryption వల్ల అత్యధిక భద్రత
- ICAO e-Gates ద్వారా వేగవంతమైన స్కానింగ్
- తారుమారుచేయడం దాదాపుగా అసాధ్యం
చిప్ డేటా మరియు ప్రింట్ డేటా ఒకేలా ఉన్నాయో లేదో immigration reader వెంటనే పోల్చుకుంటుంది. ఈ కారణంగా అధికారులు దీన్ని “భారత పాస్‌పోర్ట్ వ్యవస్థలో ఏకంగా 3G నుంచి 5Gకి జంప్“గా పోల్చుతున్నారు.
ఈ-పాస్‌పోర్ట్ ఎక్కడ లభిస్తోంది? ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేయాలి?
✔️ ప్రస్తుతం ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ అవుతున్న 13 నగరాలు
నాగపూర్, భువనేశ్వర్, జమ్మూ, గోవా, శిమ్లా, రాయపూర్, అమృత్‌సర్, జైపూర్, చెన్నై, హైదరాబాద్, సూరత్, రాంచీ, ఢిల్లీ. త్వరలో మిగిలిన PSK/POPSK కేంద్రాల్లో కూడా పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి.
✔️ అర్హత (Eligibility)
- సాధారణ పాస్‌పోర్ట్‌కు అర్హులు అయిన వారందరూ
- మన నగరంలో ఈ–పాస్‌పోర్ట్ జారీ చేసే పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఉంటే. ఉంటే
- ప్రత్యేక అర్హతలు, అదనపు పత్రాలు, అదనపు ఫీజు—ఏమీ లేవు
✔️ దరఖాస్తు విధానం – Step-by-step (సంక్షిప్తంగా)
-
Passport Seva Portalలో రిజిస్టర్ చేసుకోవాలి.
-
కొత్త, పాత పాస్‌పోర్ట్ రెన్యూవల్ (Fresh/Re-issue Form Fill) ఎంచుకోవాలి.
-
ఆన్లైన్లోనే రుసుము చెల్లించాలి(Online fee payment)
-
తర్వాత ఎంపిక చేసుకున్న PSK/POPSKలో అపాయింట్‌మెంట్ తీసుకోవాలి.
-
ఒరిజినల్ పత్రాలు తీసుకెళ్లాలి. అక్కడ బయోమెట్రిక్(వేలిముద్రలు, ఐరిస్) తీసుకుంటారు.
-
అవసరమైతే పోలీసు పరిశీలన జరుగుతుంది. Police verification (case-to-case)
-
అన్నీ సరిగ్గా ఉంటే, వారంరోజుల్లో కొత్త ఈ–పాస్‌పోర్ట్ ఇంటికే పోస్ట్‌లో వస్తుంది.
ఇప్పుడున్న పాస్‌పోర్ట్ పరిస్థితి ఏంటి?
1. చెల్లుబాటు గడువు ఉన్నంతవరకు పాత పాస్‌పోర్ట్ మార్చనవసరం లేదు.
2. అది గడువు తీరేవరకు చెల్లుబాటు అవుతుంది.
3. కొత్తగా లేదా రీ-ఇష్యూ(రెన్యూవల్, పోగొట్టుకోవడం, ఇతర కారణాలతో..) చేసినప్పుడు కొత్త ఈ-పాస్‌పోర్ట్ వస్తుంది
అత్యంత సాధారణ ప్రశ్నలు (FAQ)
1) ePassport నిజంగా ఎంత భద్రం?
చిప్‌లోని డేటా digitally signed. ఇది మార్చడం అసాధ్యం. Identity fraud, duplication పూర్తిగా నివారణ.
2) నా పాత పాస్‌పోర్ట్ వాడొచ్చా?
అవును. expiry వరకు 100% చెల్లుబాటవుతుంది.
3) నేను కావాలనుకుంటే ePassport తీసుకోవచ్చా?
కుదరదు. మీ పాత పాస్‌పోర్ట్ గడువు తీరిపోతేనో, పోగొట్టుకుంటేనో, పాడైపోవడం వల్ల మాత్రమే సాధ్యం. లేదా కొత్తవారు అప్లయి చేసుకుంటేనే. అది కూడా మీ PSKలో ఈ–పాస్‌పోర్ట్ జారీ చేసే సాంకేతిక సౌలభ్యం ఉంటేనే.
4) అదనపు ఫీజులు లేదా ప్రత్యేక పత్రాలు కావాలా?
అవసరం లేదు. ఒకే ఫీజు. అవే పత్రాలు.
5) నేను పొందినది ePassportనా అని ఎలా తెలుసుకోవాలి?
పాస్‌పోర్ట్ కవర్‌పై ఉన్న gold-coloured chip symbol చూసి వెంటనే గుర్తించవచ్చు.
