విధాత : చత్తీస్ గఢ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బిలాస్ పూర్ స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును కోర్బా ఫ్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
ఫ్యాసింజర్ రైలు గూడ్స్ ను ఢీకొట్టడంతో ఫ్యాసింజర్ రైలు బోగీలు గూడ్స్ డబ్బాలపై పైకి ఎక్కాయి.
ఘటన స్థలానికి రైల్వే సిబ్బంది, అధికారులు చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
