ఆలయంలో చిరుత పులి పిల్ల కలకలం

విధాత : అడవిలో తిరుగాడాల్సిన ఓ చిరుత పులి పిల్ల తప్పిపోయి ఓ ఆలయంలో దర్శనమివ్వడం కలకలం రేపింది. హర్యానాలోని పంచకులలోని పించోర్ జిల్లాలోని ఓ ఆలయంలో చిరుత పులిపిల్ల కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. చాకచక్యంగా చిరుత పులిపిల్లను సురక్షితంగా పట్టుకుని రక్షించారు. అనంతరం ఆ చిరుత పులి పిల్లను సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. సమీప అటవీ ప్రాంతం నుంచి అది తల్లి నుండి తప్పిపోయి ఆలయానికి చేరినట్లుగా భావిస్తున్నారు. అందుకే దానిని తిరిగి అడవిలోనే వదిలేసి తల్లి వద్దకు చేరేలా అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.