Site icon vidhaatha

NIMCET 2025 | ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ఎంసీఏ కోర్సులో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మే 16 చివ‌రి తేదీ

NIMCET 2025 | ఎన్ఐటీ( NIT ), ట్రిపుల్ ఐటీ( IIIT )ల్లో ఎంసీఏ కోర్సు( MCA Course )ల్లో ప్ర‌వేశాల కోసం ప్ర‌తి ఏడాది నిమ్‌సెట్( NIMCET 2025 ) పేరిట నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తారు. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా మాస్ట‌ర్ ఆఫ్ కంప్యూట‌ర్స్ అప్లికేష‌న్స్( Master of Computer Application ) కోర్సులో ప్రవేశాలు క‌ల్పిస్తారు. ఈ ఏడాది నిమ్‌సెట్ – 2025( NIMCET 2025 )ను తిరుచిరాప‌ల్లి ఎన్ఐటీ( Tiruchirappalli NIT ) నిర్వ‌హిస్తుంది.

అర్హ‌తలు..

మూడేండ్ల బీఎస్సీ లేదా బీఎస్సీ(ఆన‌ర్స్‌) లేదా బీసీఏ లేదా బీ వోకేష‌న‌ల్(కంప్యూట‌ర్ అప్లికేష‌న్‌) లేదా బీబీఏ(కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌), బీఈ/ బీటెక్‌లో క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ఇక మూడేండ్ల డిగ్రీ కోర్సులో మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్ ఒక స‌బ్జెక్టుగా చ‌దివి ఉండాలి. ఓపెన్ యూనివ‌ర్సిటీ డిగ్రీ చ‌దివిన వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ప‌రీక్షా విధానం..

నిమ్‌సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను ఆన్‌లైన్ విధానంలో నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లీష్ మాధ్య‌మంలో ఉంటుంది. మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ ప్ర‌శ్న‌లు ఇస్తారు. మూడు పార్టులుగా ఎగ్జామ్ ఉంటుంది.

పార్ట్ – 1 : పార్ట్ – 1 లో భాగంగా మ్యాథ‌మేటిక్స్ నుంచి 50 ప్ర‌శ్న‌లు ఇస్తారు. ప్ర‌తి స‌రైన జ‌వాబుకు 12 మార్కులు కేటాయించ‌నున్నారు. త‌ప్పు జ‌వాబుకు మూడు కోత విధిస్తారు. మొత్తం 600 మార్కులు. ప‌రీక్ష స‌మ‌యం 70 నిమిషాలు.

పార్ట్ – 2 : అన‌లిటిక‌ల్ ఎబిలిటీ అండ్ లాజిక‌ల్ రీజనింగ్ నుంచి 40 ప్ర‌శ్న‌లు ఇవ్వ‌నున్నారు. ప్ర‌తి స‌రైన జ‌వాబుకు 6 మార్కులు. త‌ప్పు జ‌వాబుకు 1.5 మార్కులు కోత విధిస్తారు. మొత్తం 240 మార్కులు. ప‌రీక్ష స‌మ‌యం 30 నిమిషాలు.

పార్ట్ – 3 : కంప్యూట‌ర్ అవేర్‌నెస్ నుంచి 20 ప్ర‌శ్న‌లు ఇస్తారు. స‌రైన జ‌వాబుకు 6 మార్కులు. త‌ప్పు జ‌వాబుకు 1.5 మార్కులు కోత విధిస్తారు. మొత్తం 120 మార్కులు. అదే విధంగా జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్ నుంచి 10 ప్ర‌శ్న‌లు ఇస్తారు. స‌రైన జ‌వాబుకు 4 మార్కులు. త‌ప్పు జ‌వాబుకు ఒక మార్కు కోత విధిస్తారు. మొత్తం మార్కులు 40. ప‌రీక్ష స‌మ‌యం 20 నిమిషాలు.

ప్ర‌వేశాలు క‌ల్పించే ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలు ఇవే..

ఎన్ఐటీలు.. అగ‌ర్త‌లా, అల‌హాబాద్, భోపాల్, ఢిల్లీ, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర‌, ప‌ట్నా, రాయ్‌పూర్, తిరుచిరాప‌ల్లి, వ‌రంగ‌ల్.
ట్రిపుల్ ఐటీలు.. భోపాల్, వ‌డోద‌ర‌.

ముఖ్య‌మైన తేదీలు

ద‌ర‌ఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివ‌రి తేదీ : మే 16
ప‌రీక్ష తేదీ : జూన్ 8(మ‌ధ్యాహ్నం 2 నుంచి 4 వ‌ర‌కు)
పూర్తి వివ‌రాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
https://nimcet.admissions.nic.in 

 

Exit mobile version