No Traffic Signals | భారతదేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు నిత్యం రద్దీగా ఉంటాయి. రహదారులన్నీ వాహనాలతో( Vehicles ) కిటకిటలాడుతుంటాయి. కనీసం రోడ్డు దాటాలంటే కూడా నిమిషాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ట్రాఫిక్ సిగ్నల్స్( Traffic Signals ) ఉన్నా కూడా ట్రాఫిక్ నిబంధనలు( Traffic Rules ) ఉల్లంఘిస్తూ అడ్డదిడ్డంగా వాహనాలను నడుపుతుండడం చాలా చోట్ల చూసే ఉంటాం. కానీ మన దేశంలోని ఈ పట్టణంలో మాత్రం ట్రాఫిక్ సిగ్నల్స్ లేనే లేవు. ఇది వినడానికి, చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అక్షరాల నిజం. మరి ఆ పట్టణం దేశ రాజధాని ఢిల్లీ( Delhi ) నగరంలో లేదా ఆర్థిక రాజధాని ముంబై( Mumbai )లో లేదా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు నెలవైన బెంగళూరు( Bengaluru )లో అనుకుంటే పొరపాటు. మరి ఎక్కడ ఉందంటే..? ఈ కథనం చదవాల్సిందే.
రాజస్థాన్( Rajasthan )లోని కోటా( Kota ) అనే పట్టణం.. ప్రముఖ విద్యాసంస్థలకు అడ్డా. ఇక్కడ అనేక మంది విద్యార్థులు ఐఐటీ( IIT ), నీట్( NEET ) ఎగ్జామ్స్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేరవుతుంటారు. నిత్యం విద్యార్థులతో కోటా ప్రాంతం కిటకిటలాడుతుంది. అలాంటి కోటాలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేనే లేవు. ఒక క్రమపద్ధతిలో వాహనాలు నడుస్తుంటాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పాదచారులకు సహకరిస్తుంటారు.
కోటా అర్బన్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్(UIT) ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని నగరంగా తీర్చిదిద్దారు. కోటా పట్టణమంతా వెతికినా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపించవు. అండర్ పాస్‌లు, రింగ్ రోడ్స్, ఫ్లై ఓవర్ల ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తుంటారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం లేకుండా పోయింది. ఎక్కడికక్కడ రోడ్ కనెక్టివిటీ అద్భుతంగా ఉంది. దీంతో వాహనదారులు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొకుండా ప్రయాణిస్తుంటారు.
ఇక కోటా పట్టణంలో 25 వరకు ఫ్లై ఓవర్లు ఉన్నాయి. చాలా చోట్ల అండర్ పాస్‌లను ఏర్పాటు చేశారు. ఈ అండర్ పాస్‌లో రింగ్ రోడ్లను కలుపుతూ ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం లేకుండా పోయింది కోటాలో. ఈ క్రమంలో ట్రాఫిక్‌లో గంటల తరబడి ఇరుక్కుపోయే పరిస్థితి లేనే లేదు. దీంతో సమయం కలిసి రావడంతో పాటు జర్నీలో అలసటకు అవకాశమే లేదు. ప్రమాదాలు కూడా తక్కువే. దీంతో కోటా ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు.. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని సిటీని చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఇక కోటా నగరం ముఖ్యంగా విద్యాలయాలకు, అనేక కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి. ఈ పట్టణంలో అధికంగా నీట్, ఐఐటీ కోచింగ్ సెంటర్లు ఉంటాయి. దేశంలోని ప్రథమ ర్యాంకర్లు కూడా ఇక్కడే ఉద్భవిస్తుంటారు. అలా కోటా నగరానికి ప్రత్యేకత ఉంది. దాంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ లేని సిటీగా కూడా ప్రాచుర్యం పొందింది.
