Site icon vidhaatha

Offer | ఫస్ట్ టైమ్‌ ఓటర్ల కోసం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ బంపర్‌ ఆఫర్‌..!

Offer : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రోత్సహించేందుకు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. జీవితంలో తొలిసారి ఓటు వేయబోయే యువతను దృష్టిలో ఉంచుకొని విమాన టికెట్‌ ధరపై ప్రత్యేక రాయితీని ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల టికెట్‌ ధరలపై వారికి 19 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది.

అయితే ఈ ఆఫర్‌ పొందాలనుకునే వారి కోసం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కొన్ని షరతులు విధించింది. ఫ్లైట్‌ టికెట్‌పై రాయితీ పొందగోరే వారు 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ నుంచి టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. ఏప్రిల్‌ 18 నుంచి జూన్‌ 1 మధ్య ప్రయాణించే వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

అంతేగాక ప్రయాణికుడు ఓటు వేయబోయే నియోజకవర్గానికి సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్టు తన గమ్యస్థానమై ఉండాలి. ఆఫర్‌ పొందడం కోసం ఓటర్‌ ఐడీ సహా సంబంధిత పత్రాలు చూపించాలి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లోని (Air India Express) ఎక్స్‌ప్రెస్‌ లైట్‌, ఎక్స్‌ప్రెస్‌ వాల్యూ, ఎక్స్‌ప్రెస్‌ ఫ్లెక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బిజ్‌.. ఇలా నాలుగు కేటగిరీలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేస్తుంది.

Exit mobile version