న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రేపు శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంతో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్బంగా ప్రధానిమోదీ సీఎంలకు వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకం చేయనున్నట్లుగా సమాచారం. పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో దేశంలో పెరిగిపోయిన చమురు, గ్యాస్ కొరతల సమస్యల నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆ రాష్ట్రాలతో సీఎస్ లతో ప్రత్యేక భేటీ
ప్రధాని మోదీ నిర్వహించే సీఎం వీడియో కాన్ఫరెన్స్ కు వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలిసింది. సీఎంలకు బదులుగా ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రధాని-సీఎంల వీడియో కాన్ఫరెన్స్‌లో తీసుకున్న వివరాలను సీఎస్‌లకు వెల్లడించి.. ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేలా కేబినెట్ సెక్రటరీ సూచించనున్నట్లుగా కేంద్రం తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Hyderabad Traffic Diversions : రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు: సీఎం రేవంత్ రెడ్డి
