పెట్రోల్‌, డీజిల్‌కు కొరత లేదు: కేంద్రం

దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీకి కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది.

No shortage of petrol diesel

న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీకి కొరత లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. దేశీయంగా 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ కొరత పేరిట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేసింది. దేశ వ్యాప్తంగా నిర్వహణలో ఉన్న అన్ని పెట్రోల్ పంపులు సాధారణంగా పనిచేస్తున్నాయని వివరించింది. అనవసరంగా తప్పుడు ప్రచారాన్ని నమ్మి బంక్ ల వద్దకు పరుగెత్తి సమస్యలు సృష్టించవద్దని పేర్కొంది.

దేశీయంగా ఉన్న నిల్వలలో పాటు రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు సరఫరాకు సంబంధించి భారతీయ చమురు కంపెనీలు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయి అని కేంద్రం తెలిపింది. అటు ఎల్పీజీ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయి అని, కొత్తగా పలు దేశాల నుంచి ఎల్పీజీ నౌకలు కూడా వస్తుండటంతో గ్యాస్ సరఫరా మరింత సులభం కానుంది అని స్పష్టం చేసింది. గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు పెంపుపై వస్తున్న వార్తలు నిజం కాదనీ, గ్యాస్ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవని పేర్కొంది. ఏ రకమైన కనెక్షన్‌ అన్న అంశంతో సంబంధం లేకుండా పట్టణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్‌కు 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు ఎప్పటిలాగానే కొనసాగుతుందని సుజాత శర్మ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

Viral Video | మథుర రైల్వే స్టేషన్‌లో నకిలీ పాము.. యువకుడి చేష్టలతో హడలిపోయిన ప్రయాణికులు!
అసైన్డ్ భూముల నివాసాలపై కమిటీ: మంత్రి పొంగులేటి

Latest News